Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అసలు చరణ్ - ఎన్టీఆర్ మధ్య ఏం జరుగుతోంది?

అసలు చరణ్ - ఎన్టీఆర్ మధ్య ఏం జరుగుతోంది?

Chitrajyothy 3 months ago

కప్పుడు స్క్రీన్ పైన.. స్క్రీన్ బయట.. 'దోస్తీ' అంటే వీళ్ళదే అనుకున్నారు అంతా!. గ్లోబల్ రేంజ్‌లో 'RRR'తో సంచలనం సృష్టించిన టాలీవుడ్ టాప్ స్టార్స్ రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)ల బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

కానీ.. ఇప్పుడు సీన్ మారింది!. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియానే రిలేషన్స్‌కి కొలమానం అయిపోయింది. అలాంటి ఈ రోజుల్లో... ఈ ఇద్దరు గ్లోబల్ స్టార్స్ మధ్య అకస్మాత్తుగా ఆవరించిన 'నిశ్శబ్దం' ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.

ఈ అనుమానాలకు, పుకార్లకు మొదటి బీజం పడింది రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'పెద్ది' (Peddi) ట్రైలర్ లాంచ్‌తో!. ఈ సినిమా మాస్ ప్రమోషనల్ కంటెంట్ రిలీజైన నిమిషాల్లోనే ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతూ, ఇండస్ట్రీలోని సెలబ్రిటీలందరి నుంచి ప్రశంసలు అందుకుంది. కానీ.. తోటి హీరోల సినిమాలకు సోషల్ మీడియా ద్వారా వెంటనే 'ఆల్ ది బెస్ట్' చెప్పే ఎన్టీఆర్... చరణ్ సినిమా అప్‌డేట్‌పై ఎక్కడా బహిరంగంగా స్పందించలేదు. ఈ 'డిజిటల్ సైలెన్స్' నెటిజన్ల కంటపడింది. ఇద్దరి మధ్య ఏదో బలమైన కారణమే ఉందనే ఊహాగానాలకు తెరలేపింది. ఇక బుధవారం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజైన 'డ్రాగన్' (Dragon) గ్లింప్స్‌తో ఈ గ్యాప్ మరింత స్పష్టంగా కనిపించింది. ఎన్టీఆర్ బర్త్‌డే రోజు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరూ సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'డ్రాగన్' టీజర్‌ను మెచ్చుకుంటూ ఎంతో ఆత్మీయంగా 'బావ' అని చేసిన ట్వీట్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అయింది. అయితే, అందరి కళ్ళు రామ్ చరణ్ అకౌంట్ పైనే ఉన్నాయి. కానీ ఆశ్చర్యకరంగా.. చరణ్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ రోజంతా ఎలాంటి పోస్ట్ లేకుండా పూర్తిగా సైలెంట్‌గా ఉండిపోయాయి. ప్రతి ఏటా ఎంతో స్పెషల్‌గా విష్ చేసుకునే ఈ 'ఆర్ఆర్ఆర్' హీరోలు... ఈసారి కనీసం ఆ రొటీన్‌ను కూడా పాటించకపోవడంతో ఫ్యాన్స్ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.

ఈ నిశ్శబ్దాన్ని చూసి ఇరుపక్షాల అభిమాన సంఘాలు సోషల్ మీడియాలో యుద్ధాలు మొదలుపెట్టేశాయి. ఇది రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర ఉండబోయే అల్టిమేట్ పోటీకి సంకేతమని కొందరు అంటుంటే.. ఇండస్ట్రీ ఇన్‌సైడర్స్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుతం చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ అత్యంత భారీ బడ్జెట్‌తో, పాన్-ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారని.. నిరంతర షూటింగులు, ప్రమోషన్ల షెడ్యూల్స్ వల్లే సోషల్ మీడియా పీఆర్ యాక్టివిటీస్‌పై దృష్టి పెట్టలేకపోతున్నారని క్లారిటీ ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసే ఈ డిజిటల్ ప్రపంచంలో... టాలీవుడ్‌లో ఎప్పటినుంచో వస్తున్న ఈ 'క్రాస్-ప్రమోషన్ల' ట్రెండ్‌కు అకస్మాత్తుగా బ్రేక్ పడటం నిజంగానే ఆశ్చర్యకరం. మరి ఈ అల్టిమేట్ నరేటివ్ వార్‌లో అసలు నిజం ఏంటి? వీరి మధ్య నిజంగానే దూరం పెరిగిందా? లేక ఇదంతా కేవలం వర్క్ బిజీనా? అనేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

'లవ్ యూ కళ్యాణ్'.. మెగా158 లాంచ్‌పై చిరు ట్వీట్ వైరల్!

Drishyam 3: దృశ్యం 3 మూవీ రివ్యూ

చిరుకి కాదు.. బాలయ్యకు విలన్‌గా మనోజ్!

Peddi Movie: 24 గంటల్లో 'పెద్ది' ట్రైలర్ బీభత్సం.. హిస్టారికల్ రికార్డ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy