Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
72nd National Awards: జ్యూరీ ఛైర్మన్ మలయాళీ కాబట్టి.. అల్లు అర్జున్‌కి డౌటేనా!?

72nd National Awards: జ్యూరీ ఛైర్మన్ మలయాళీ కాబట్టి.. అల్లు అర్జున్‌కి డౌటేనా!?

Chitrajyothy 3 weeks ago

72వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలను (72nd National Awards) త్వరలో ప్రకటించనున్నారు. 2024 సంవత్సరంలో విడుదలైన భారతీయ చిత్రాలకు గానూ అవార్డుల అనౌన్స్‌మెంట్ రానుంది.

ఈ అవార్డులలో ఎన్ని ఉన్నప్పటికీ బెస్ట్ యాక్టర్ కేటగిరీపై ప్రస్తుతం సోషల్ మీడియా వేడెక్కుతోంది. ఎందుకంటే, బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు కూడా ఉండటంతో.. అనౌన్స్‌మెంట్ కోసం అంతా ఎంతగానో వేచి చూస్తున్నారు. ప్రస్తుతం ఈ కేటగిరీ విషయమై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అల్లు అర్జున్‌ (Allu Arjun)కి డౌటే అనేది ఈ చర్చలో ప్రధానాంశం. ఎందుకలా అంటే..

ఈ జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా సౌత్ ఫిల్మ్ మేకర్ జయరాజ్ (Jayaraj) వ్యవహరిస్తున్నారు. ఆయన మలయాళీ కావడంతో.. కచ్చితంగా బెస్ట్ యాక్టర్ అవార్డు మలయాళ చిత్రాలకే వెళుతుందనేది ఈ చర్చలలోని మెయిన్ సారాంశం. ఈ కేటగిరీలో మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి మమ్ముట్టి (భ్రమయుగం), పృథ్వీరాజ్ సుకుమారన్ (ది గోట్ లైఫ్) ఉన్నారు. వారిద్దరిలో ఒకరికే ఈసారి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందనేలా టాక్ మొదలైంది. అందులోనూ మమ్ముట్టికి ఖరారు అయినట్లుగా కూడా.. కొందరు ఫిక్స్ అయిపోతున్నారు. అయితే అధికారిక అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఇది సస్పెన్సే. మలయాళీ ఫిల్మ్ మేకర్ ఛైర్మన్‌గా ఉన్నారు కాబట్టి.. కచ్చితంగా ఆ ఇండస్ట్రీకే ఈసారి బెస్ట్ యాక్టర్ అవార్డు ఉంటుందనేలా.. బీభత్సంగా చర్చలు అయితే నడుస్తున్నాయి. చూద్దాం.. ఫైనల్‌గా ఎవరు ఈసారి ఉత్తమ నటుడిగా నిలుస్తారో.

ఒకవేళ అల్లు అర్జున్‌కి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తే మాత్రం.. అది చరిత్రే అవుతుంది. రెండో సారి నేషనల్ అవార్డు అందుకున్న జాబితాలో ఆయన పేరు చేరుతుంది. ఇప్పటి వరకు అమితాబ్ బచ్చన్ 4 సార్లు.. షబానా అజ్మీ, కమల్ హాసన్, మమ్ముట్టి, అజయ్ దేవగన్ 3 సార్లు ఈ అవార్డును గెలుచుకున్నారు. టాలీవుడ్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ లిస్ట్‌లో లేరు. ఇప్పుడు అల్లు అర్జున్‌కి వస్తే మాత్రం టాలీవుడ్ నుంచి రెండు సార్లు ఈ అవార్డును గెలుచుకున్న నటుడిగా హిస్టరీ క్రియేట్ చేస్తారు. చూద్దాం.. ఎవరి పేరు ఫైనల్ అవుతుందో. మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్, అల్లు అర్జున్‌లతో పాటు బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్, కార్తీక్ ఆర్యన్ ఈసారి బెస్ట్ యాక్టర్ రేసులో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

National Award: మళ్లీ అల్లు అర్జున్‌కేనా? అదే జరిగితే చరిత్రే!

'రావు బహదూర్'.. ఆంధ్ర, సీడెడ్, నైజాంలో వేరువేరుగా టికెట్ ధరలు

'జైలర్ 2'కి పోటీగా.. చిరంజీవి 'విశ్వంభర' రిలీజ్ అప్పుడేనా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy