Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రీతి జింటాతో డేటింగ్‌.. క్రికెటర్ బ్రెట్‌ లీ షాకింగ్ కామెంట్స్

ప్రీతి జింటాతో డేటింగ్‌.. క్రికెటర్ బ్రెట్‌ లీ షాకింగ్ కామెంట్స్

Chitrajyothy 2 weeks ago

త కొంతకాలంగా బాలీవుడ్ నటి ప్రీతి జింటా (Preity Zinta)తో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ బ్రెట్‌ లీ డేటింగ్ చేస్తున్నారనేలా.. ఎప్పటి నుంచో వార్తలు వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే.

పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ టీమ్‌కు ఓనర్‌గా ఉన్న రోజుల్లో వీరిద్దరూ చాలా దగ్గరగా కనిపించడంతో ఇలాంటి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇలా ఒక్కసారి కాదు, పదే పదే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనేలా టాక్ నడుస్తూనే ఉంది. 2008 నుంచి 2011 మధ్య బ్రెట్ లీ పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆడారు. అప్పటి నుంచి ఏదో రకంగా వీరిపై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే అప్పట్లోనే అంటే, 2010లోనే ఈ వార్తలపై ప్రీతి జింటా స్పందించి, అలాంటిదేమీ లేదని ఖండించారు. అయినా కూడా వార్తలు ఆగలేదు. తాజాగా ఈ డేటింగ్ వార్తలపై బ్రెట్ లీ (Brett Lee) కూడా షాకింగ్‌గా రియాక్ట్ అయ్యారు.

తాజాగా ఆయన బాంబే టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రీతి జింటాతో డేటింగ్ వార్తలను ఖండించారు. ''నేను ఏ బాలీవుడ్‌ నటితోనూ డేటింగ్‌ చేయలేదు. పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆడినప్పటి నుంచి ప్రీతి జంటా నాకు మంచి స్నేహితురాలు. నేను ఆ జట్టుకు ఆడకపోయినప్పటికీ, ఆమెతో ఇప్పటికీ ఆ స్నేహం అలానే కొనసాగుతోంది. ప్రీతి చాలా తెలివైన మహిళ. ఆమెపై నాకు ఎప్పుడూ ఎంతో గౌరవం ఉంటుంది. ఇలాంటి రూమర్స్ నన్నెప్పుడూ ప్రభావితం చేయలేదు. నిజమేంటో నాకు తెలుసు. ఎవరు ఏం అనుకుంటే నాకేంటి అని ఎప్పుడూ పట్టించుకోలేదు'' అని బ్రెట్ లీ చెప్పుకొచ్చారు.

బ్రెట్‌ లీ విషయానికి వస్తే.. ఆయన 2006లో ఎలిజబెత్‌ కెంప్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే, పెళ్లయిన రెండేళ్లకే వీరిద్దరూ విడిపోయి, 2009లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2014లో లానా ఆండర్సన్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. మరోవైపు ప్రీతి జింటా 2016లో అమెరికాకు చెందిన జీన్‌ గుడెనఫ్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2021లో సరోగసీ ద్వారా కవలలు జన్మించారు. ప్రీతి జింటా ఇప్పుడు బిజినెస్‌తో పాటు నటిగానూ బిజీగా ఉన్నారు. ఆమె నటించిన 'బత్వారా 1947' సినిమా ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.

ఇవి కూడా చదవండి:

ప్రదీప్ రావత్ మృతి.. టాలీవుడ్‌లో స్పందనేది

తండ్రి పాత్రకు పొట్ట బాగా ఉండాలన్నారు.. ఏం చేసేవాడినంటే: త్రినాథరావు నక్కిన

గ్లామర్‌ డోస్ పెంచితే ఆఫర్స్‌ వచ్చేస్తాయా రాశీ..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy