Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గ్లామర్‌ డోస్ పెంచితే ఆఫర్స్‌ వచ్చేస్తాయా రాశీ..

గ్లామర్‌ డోస్ పెంచితే ఆఫర్స్‌ వచ్చేస్తాయా రాశీ..

Chitrajyothy 2 weeks ago

'ఊహలు గుసగుసలాడే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, తన క్యూట్ నటనతో రొమాంటిక్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న భామ రాశీ ఖన్నా (Raashii Khanna).

మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత రవితేజ, ఎన్టీఆర్, వరుణ్ తేజ్ వంటి అగ్ర హీరోలతో నటిస్తూ వరుస ఆఫర్లతో టాప్ గేర్‌లో దూసుకెళ్లింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న రోల్స్ ఎంచుకుంటూ తనదైన ముద్ర వేసింది. అయితే, సినీ ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉన్నా.. కెరీర్ లాంగ్ రన్ అవ్వాలంటే మాత్రం బాక్సాఫీస్ హిట్లు చాలా ముఖ్యం. ఈ విషయంలో రాశీకి అవకాశాల పరంగా కొదవలేకపోయినా, సరైన బిగ్ హిట్ పడకపోవడం ఆమె కెరీర్‌ను కొంత డిఫెన్స్‌లో పడేసింది.

గ్లామర్ ప్రపంచంలో విజయాలే ముఖ్యాంశం. ఈ ఏడాది తెలుగులో పవన్‌ కళ్యాణ్‌ సరసన నటించిన 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' వంటి క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ, ఆ చిత్రం ఆమె కెరీర్‌కి పెద్దగా మైలేజ్ ఇవ్వలేకపోయింది. దీంతో ప్రస్తుతం టాలీవుడ్‌లో అమ్మడి చేతిలో ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా లేని పరిస్థితి నెలకొంది. టాలీవుడ్‌లో కొత్త అవకాశాలు తగ్గిపోయినప్పటికీ.. కోలీవుడ్‌, బాలీవుడ్‌ ఇండస్ట్రీలలో మాత్రం రాశీ ఖన్నా హవా నడుస్తోంది. పలు క్రేజీ వెబ్ సిరీస్‌లు, ఓటీటీ ప్రాజెక్ట్‌లలో నటిస్తూ అక్కడ మంచి మార్కులే కొట్టేస్తోంది. సినిమాల సంగతి ఎలా ఉన్నా, ప్రస్తుతం సోషల్ మీడియాలో రాశీ ఖన్నా సృష్టిస్తోన్న రచ్చ మాత్రం వేరే లెవల్. ఇప్పటివరకు హోమ్లీ, పద్ధతైన పాత్రల్లో ఎక్కువగా కనిపించిన ఈ భామ, అనూహ్యంగా గ్లామర్ గేర్లు మార్చింది. గ్లామరస్ అవుట్‌ఫిట్స్‌లో హాట్ హాట్ ఫోటోషూట్‌లు చేస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా క్లీవేజ్ షోతో, బోల్డ్ పోజులతో అందాల ఆరబోతకు తెరలేపడంతో అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

ఇంతకీ రాశీ ఖన్నా ఉన్నట్టుండి ఈ స్థాయిలో గ్లామర్ డోస్ పెంచడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి..? ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. గ్లామర్, బోల్డ్ తరహా పాత్రలు చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, సరికొత్త క్యారెక్టర్లు వస్తే సిద్ధంగా ఉన్నానని డైరెక్టర్లు, నిర్మాతలకు సంకేతాలు పంపడానికే రాశీ ఈ రేంజ్‌లో స్కిన్ షో చేస్తోందని విశ్లేషిస్తున్నారు. హీరోయిన్‌గా రీ-ఎంట్రీ ఇచ్చి, టాలీవుడ్‌లో మళ్లీ పూర్వ వైభవం సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది రాశీ. తన కొత్త అవతారంతో మేకర్స్‌ని ఆకట్టుకుని ఆఫర్లు పట్టుకోవాలని చూస్తోంది. మరి రాశీ ఖన్నా వేసిన ఈ గ్లామర్ పాచిక పారి, టాలీవుడ్‌లో మళ్లీ ఆమెకు వరుస అవకాశాలు తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి:

ఓరి మీ దుంప తెగ.. స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఇలా ఉన్నారేంట్రా!

'రాంబాయి' కూడా ఫీల్డ్‌లోకి దిగిందిగా!

'రామాయణ' డిజైన్ దుస్తుల కాంట్రవర్సీపై డిజైనర్స్ ఫైర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy