Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Raghava Theater: ఈ థియేటర్‌లో ఫస్ట్, లాస్ట్ సినిమా ఎన్టీఆర్‌దే.. భావోద్వేగంలో ఫ్యాన్స్!

Raghava Theater: ఈ థియేటర్‌లో ఫస్ట్, లాస్ట్ సినిమా ఎన్టీఆర్‌దే.. భావోద్వేగంలో ఫ్యాన్స్!

Chitrajyothy 2 weeks ago

కాలానుగుణంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సినీ రంగంలో మారుతున్న పరిస్థితుల కారణంగా సినిమా థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కొత్త థియేటర్లు ఏర్పాటు లేకపోగా..

ఉన్న థియేటర్లు ఒక్కొక్కటిగా మూతబడుతూ వస్తున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో థియేటర్లు మూతపడినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ క్రమంలో జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో ఒకప్పుడు మొత్తం 14 సింగిల్ స్ర్కీన్ థియేటర్లు ఉండేవి. అందులో, ఇప్పటికే 8 థియేటర్లు మూతపడ్డాయి. తాజాగా ఇప్పుడు రాఘవ థియేటర్ (Raghava Theater) మూతపడింది. చిత్తూరు నగరంలో రాఘవ థియేటర్‌కు ఓ ప్రత్యేకత ఉంది. చిత్తూరు (Chittoor) నగరంలోని మిట్టూరు ప్రాంతంలో రాఘవ థియేటర్ ఏర్పాటైంది. బంగారుపాలెం మండలం, నలగాంపల్లి గ్రామంలోని ఎన్‌పి కుటుంబానికి చెందిన వీర రాఘవులు నాయుడు జ్ఞాపకార్థం ఆయన పేరుపై థియేటర్‌ను నిర్మించారు. ఆయన రాజకీయ, ఆర్థిక, సామాజిక సేవారంగాల్లో ఎన్నో పేరు ప్రఖ్యాతలు గడించారు. వీర రాఘవులు నాయుడు మరణానంతరం.. టీడీపీ ఆవిర్భావం తర్వాత చిత్తూరు నుంచి ఆయన సతీమణి ఎన్.పి. ఝాన్సీ లక్ష్మి ఎమ్మెల్యేగానూ, ఎంపీగానూ పని చేశారు.

1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు (NT Rama Rao) నటించిన 'శ్రీకృష్ణ పాండవీయం' సినిమాతో మొదలైన థియేటర్.. 40 ఏళ్ల చరిత్రలో ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. రాఘవ థియేటర్ చిత్తూరుకు ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిందని చెప్పాలి. 40 ఏళ్ల పాటు వినోదాన్ని అందించిన ఈ థియేటర్ ఇప్పుడు శాశ్వతంగా మూతబడి కనుమరుగు కావడాన్ని ప్రేక్షకులే కాదు.. యాజమాన్యం సైతం జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ థియేటర్ దగ్గర పెద్ద హీరోల సినిమాల రిలీజ్ రోజున ఫ్యాన్స్ సందడి పండుగ వాతావరణాన్ని తలపించేది. ఎన్నో సినిమాలు 100, 200, 300 రోజులు ఆడి రికార్డులు సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. 'శుభలగ్నం, పోకిరి, పెళ్లి చేసుకుందాం, సీతారామయ్యగారి మనవరాలు, అన్నమయ్య, హలో బ్రదర్' వంటి అనేక సినిమాలు ఎక్కువ రోజులు ప్రదర్శించబడి రికార్డులు సృష్టించాయి. పాత తరం నుంచి నేటి తరం వరకు ఈ థియేటర్‌తో ఎందరికో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి.

కొత్త సినిమాలు లేక ప్రేక్షకుల ఆదరణ కరువై థియేటర్లను నడపలేని దు:స్థితికి చేరడంతో థియేటర్లను మూసేసే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇప్పటికే చిత్తూరు నగరంలోని ప్రతాప్, ప్రేమల, లక్ష్మీ, జ్యోతి, దేవి, శ్రీనివాస, మాలిక్, ఆనంద.. వంటి థియేటర్లు వరసగా ఒక్కొక్కటిగా మూతపడుతూ వచ్చాయి. తాజాగా ఇప్పుడు రాఘవ థియేటర్ మూతపడింది. ఈ థియేటర్ యాదృచ్చికం ఏంటంటే.. ఎన్.టి. రామారావు సినిమాతో మొదలై.. మూతపడే నాటికి ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించిన 'దేవర' (Devara) సినిమా తర్వాత మూతపడటం. మూతపడ్డ థియేటర్లను యాజమాన్యాలు ప్రత్యామ్నాయాల వైపు మలుచుకుంటున్నారు. అయితే సినిమా రంగంలోని పెద్దలు మరో మారు పునరాలోచించి ప్రేక్షకులకు అందుబాటులో ఉండే విధంగా సినిమాలు తీసి, థియేటర్లను బతికిస్తే గానీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఉండదంటూ మూతపడ్డ థియేటర్ల యాజమాన్యాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

త్రిష లేకుంటే విజయ్ జాతకం మరోలా ఉండేది- వేణు స్వామి

Ranabaali: హార్స్ రైడింగ్ గ్లింప్స్.. విజయ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్!

Rao Bahadur: 'పెద్ది'తో పోటీకి మహేష్ బాబు 'నో'.. రిలీజ్ డేట్ మారింది!

జబర్దస్త్ దొరబాబు కొత్త ఇల్లు చూశారా.. కళ్ళు జిగేల్ మనాల్సిందే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy