Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
త్రిష లేకుంటే విజయ్ జాతకం మరోలా ఉండేది- వేణు స్వామి

త్రిష లేకుంటే విజయ్ జాతకం మరోలా ఉండేది- వేణు స్వామి

Chitrajyothy 2 weeks ago

ళపతి విజయ్ (Thalapathy Vijay) కేవలం వెండితెరపైనే కాకుండా, ఇప్పుడు రాజకీయ క్షేత్రంలోనూ పెను సంచలనంగా మారారు. సినిమాల్లో తిరుగులేని మాస్ ఇమేజ్‌తో కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆయన, తన రాజకీయ ప్రస్థానాన్ని కూడా అంతే వేగంగా ప్రారంభించారు.

పార్టీ స్థాపించిన అతి స్వల్ప కాలంలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకోవడం దేశవ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం ఆయన ప్రజాదరణకు నిదర్శనంగా నిలుస్తోంది, అయితే అధికార పీఠాన్ని అధిష్టించే క్రమంలో ఎదురవుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu Swamy) సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ వ్యక్తిగత జీవితం, రాజకీయ భవిష్యత్తుపై ఆయన సంచలన విశ్లేషణ చేశారు. ముఖ్యంగా నటి త్రిష (Actress Trisha) ప్రస్తావన తెస్తూ, ఆమె ప్రభావం విజయ్ జాతకంపై గణనీయంగా ఉందని వేణు స్వామి పేర్కొన్నారు. ఒకవేళ త్రిష లేకపోయి ఉంటే విజయ్ రాజకీయ ప్రస్థానం మరో దిశలో ఉండేదని, ప్రస్తుతం నెలకొన్న గ్రహస్థితులు ఆయన అధికార కాలాన్ని ప్రభావితం చేస్తాయని ఆయన విశ్లేషించడం సంచలనంగా మారింది. రాజకీయ స్థిరత్వం గురించి వేణు స్వామి మాట్లాడుతూ.. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ, ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని అభిప్రాయపడ్డారు. గురు గ్రహ మార్పుల వల్ల తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) పెను మార్పులు సంభవిస్తాయని, ఆరు నెలల నుండి ఏడాది లోపు మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం నూటికి వెయ్యి శాతం ఉందని ఆయన కుండబద్దలు కొట్టారు. కేవలం తమిళనాడు మాత్రమే కాకుండా, బెంగాల్‌లో కూడా రాష్ట్రపతి పాలన వచ్చే ఛాన్స్ ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారి విపరీతమైన చర్చకు దారితీస్తున్నాయి.

వేణు స్వామి అంచనాలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయన చెప్పిన కొన్ని విషయాలు నిజం కావడంతో కొందరు వీటిని సీరియస్‌గా తీసుకుంటుండగా, మరికొందరు మాత్రం ఇవన్నీ కేవలం పబ్లిసిటీ స్టంట్స్ అని కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా, విజయ్ సాధించిన ఘనవిజయం ఒకవైపు, ఆయన వ్యక్తిగత జీవితం చుట్టూ అల్లుకున్న వివాదాలు, జ్యోతిష్య అంచనాలు మరోవైపు వెరసి తమిళనాడు రాజకీయాలను ఉత్కంఠభరితంగా మార్చేశాయి. రాబోయే రోజుల్లో ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.

మరోవైపు విజయ్ వ్యక్తిగత జీవితం, త్రిషతో ఆయనకున్న అనుబంధం గురించి వస్తున్న వార్తలు ఆయన రాజకీయ ప్రతిష్టపై ప్రభావం చూపుతున్నాయి. విజయ్ సతీమణి సంగీత విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడం, తన భర్తకు మరో నటితో సంబంధం ఉందంటూ పిటిషన్‌లో పేర్కొనడం వంటి అంశాలు గత కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఎన్నికల ఫలితాల సమయంలో త్రిష నేరుగా విజయ్ నివాసానికి వెళ్లడం, సామాజిక మాధ్యమాల్లో ఆమె చేసిన కొన్ని పోస్టులు ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి. వ్యక్తిగత వివాదాలు రాజకీయ విజయాల మధ్య నలుగుతున్న విజయ్ పరిస్థితి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy