Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రుక్మిణి వసంత్‌ మార్ఫింగ్ ఫొటోలు.. ముగ్గురు అరెస్ట్!

రుక్మిణి వసంత్‌ మార్ఫింగ్ ఫొటోలు.. ముగ్గురు అరెస్ట్!

Chitrajyothy 4 days ago

ఐ సాయంతో హీరోయిన్ రుక్మిణి వసంత్‌ (Rukmini Vasanth)కు సంబంధించిన అసభ్యకర చిత్రాలు, వీడియోలు తయారు చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ముగ్గురు వ్యక్తులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

బాగోల్ కోట్ జిల్లా, చిలకముఖి గ్రామానికి చెందిన 24 ఏళ్ల రవి కుమార్.. బెంగళూరుకు చెందిన 33 ఏళ్ల చంద్రకాంత్.. బెంగళూరు, మహాలక్ష్మీ నగర్‌కు చెందిన 25 ఏళ్ల రంజిత్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకుని, ముగ్గురినీ శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి రిమాండ్ విధించింది.

అసలేం జరిగిందంటే.. కొంతమంది వ్యక్తులు ఏఐ సాయంతో రుక్మిణి వసంత్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకరంగా మార్చి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. అవి కాస్త వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలను గమనించిన రుక్మిణి వసంత్.. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు చేశారు. తాను బికినీ ధరించినట్లు అసభ్యకరమైన చిత్రాలను తయారు చేశారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల కారణంగా తన కుటుంబసభ్యులు ఆవేదనకు గురవుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా, ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

ఈ విషయం తెలిసి రుక్మిణి వసంత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ ముగ్గురికి మంచి గుణపాఠం నేర్పాలని, మళ్లీ ఇలాంటివి చేయాలంటే భయపడేలా, చేద్దాం అనుకునేవారికి భయం పుట్టేలా కోర్టు శిక్షించాలని.. ఎక్స్ వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. రుక్మిణి వసంత్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్నారు. తెలుగులో సైతం ఆమెకు వరస అవకాశాలు పలకరిస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం 'డ్రాగన్' (Dragon) సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే, కన్నడ స్టార్ హీరో రాకీ భాయ్ యష్ 'టాక్సిక్' (Toxic) సినిమాలోనూ హీరోయిన్‌గా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

హీరోయిన్లను అలా లాగుతున్నాడేంటి? దర్శకేంద్రుడి పై మరోసారి విమర్శలు

Maa Inti Bangaram Movie Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ

హాజరు కావాల్సిందే.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy