'ఫ్యామిలీమాన్' దర్శక ద్వయం రాజ్ - డీకే త్వరలో కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేస్తారనే దానిపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి.
దర్శకత్వం వహిస్తోంది రాజ్ కావడంతో ఆయన భార్య సమంతనే హీరోయిన్ గా పెడతారనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. అయితే ఈ సినిమాలో సమంత హీరోయిన్ కాదని... మరో బ్యూటీని తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
రాజ్-డీకే డైరెక్ట్ చేసే ఈ సినిమాలో హీరోయిన్ గా కరీనా కపూర్ ను సెలెక్ట్ చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సల్మాన్ ఖాన్ స్వయంగా కరీనాను ఫోన్ చేసి ప్రాజెక్ట్ గురించి చర్చించారట. సల్మాన్- కరీనా హిందీలో పలు చిత్రాలలో నటించారు. అయితే వీరు జంటగా నటించిన 'బజరంగీ భాయిజాన్' సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీనికి ముందు వీరు 'క్యోంకి', 'మై ఔర్ మిసెస్ ఖన్నా', 'బాడీగార్డ్' చిత్రాలలో నటించారు. దాదాపు 11 ఏళ్ళ తర్వాత వీరి కాంబో రిపీట్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ సినిమాలో సమంత కూడా ఓ రోల్ లో కనిపిస్తుందని అంటున్నారు. హీరోయిన్ కాకపోయినా ఆమెది పవర్ ఫుల్ రోల్ అని తెలుస్తోంది. ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్టును అతుల్ అగ్నిహోత్రితో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతోంది. సూపర్ హీరో చిత్రంగా రాబోతున్న దీనిని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తారట. అక్టోబర్‌లో చిత్రీకరణను మొదలు పెట్టి వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీతో నైనా సల్మాన్ ఖాన్ ఘన విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

