Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'సమ్మర్ హాలిడేస్'లో రోహన్ ఏం చేస్తున్నాడో చూశారా!

'సమ్మర్ హాలిడేస్'లో రోహన్ ఏం చేస్తున్నాడో చూశారా!

Chitrajyothy 1 week ago

క్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా అతి తక్కువ కాలంలోనే గుర్తింపు పొందారు ధీరజ్ మొగిలినేని. కథా బలమున్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ, ఆయన తన సక్సెస్ పరంపరను కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ (Dheeraj Mogilineni Entertainments) బ్యానర్ పై ఓ చిల్డ్రన్ మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 'సమ్మర్ హాలిడేస్' (Summer Holidays) పేరుతో ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. ఈ సినిమాను అందరికీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్ రాయ్ (Master Rohan Roy), మాస్టర్ అరుణ్ (Master Arun) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఓ పోస్టర్‌ను వదిలారు.

ఈ సినిమాలో నటిస్తోన్న బాల నటుడు రోహన్ పుట్టినరోజు నేడు (మే 16). రోహన్ బర్త్‌డేని పురస్కరించుకుని 'సమ్మర్ హాలిడేస్' చిత్రం నుంచి ఓ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇటీవల వచ్చిన '90's మిడిల్ క్లాస్ బయోపిక్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' వంటి చిత్రాల్లో నటించి బాల నటుడిగా రోహన్ మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ పోస్టర్‌లో సమ్మర్‌లో పిల్లలందరూ చేసే పనే రోహన్ చేస్తున్నారు. ఈ మధ్య పిల్లలందరి చేతుల్లో కామన్‌గా కనిపించే క్రికెట్ బ్యాట్‌తో ఇందులో రోహన్ పరుగులు తీస్తున్నారు. ఫేస్‌లో నవ్వు చూస్తుంటే.. గేమ్‌లో విన్ అయినట్లుగా అనిపిస్తోంది. మొత్తంగా అయితే ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరో బాల నటుడు మాస్టర్ అరుణ్ ఇటీవల వచ్చిన '35 చిన్న కథ కాదు' సినిమాతో మంచి ఫేమస్ అయ్యారు. వీళ్లిద్దరికీ 'సమ్మర్ హాలిడేస్' చిత్రం మరింత పేరు తీసుకురానుందని, త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురానున్నామని మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు. ఒక ఇంట్రెస్టింగ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని ఈ సినిమా అలరిస్తుందని టీమ్ తెలుపుతోంది.

ఇవి కూడా చదవండి:

Chiranjeevi: 'పెద్ది' ట్రైలర్ చూశా.. ఒక్కొక్కరు రఫ్ఫాడించేశారు!

Keneeshaa: 4 నెలల బిడ్డను కోల్పోయిన నేను.. జయం రవి జీవితం నాశనం చేస్తానా?

లవ్‌ - రిలేషన్‌పై మిల్కీ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy