Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సోలో హీరోగా 400 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్.. ఆడు 'పెద్ది' సారొ!

సోలో హీరోగా 400 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్.. ఆడు 'పెద్ది' సారొ!

Chitrajyothy 6 days ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'పెద్ది' (Peddi) ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో భారీ మైలురాయిని చేరుకుంది.

ఈ సినిమా రూ. 400 కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వం వహించిన ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా వీకెండ్ మాత్రమే కాకుండా, వర్కింగ్ డేస్‌లో సైతం సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతూ, భారీగా కలెక్షన్స్ రాబడుతోంది. రామ్ చరణ్ కెరీర్‌లో సోలో హీరోగా రూ. 400 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

రెండో వారంలోనూ సినిమా అద్భుతంగా రన్ అవుతూ.. రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినా ఇదని నిరూపించింది. అలాగే ప్రేక్షకులు 'పెద్ది' పాత్రతో ఎంత ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారో ఈ విజయం రుజువు చేసింది. ఇక 'పెద్ది' సాధించిన ఈ సక్సెస్‌ను పురస్కరించుకుని మేకర్స్ విక్టరీ ప్రోమో పేరుతో సినిమాలోని ఓ సన్నివేశాన్ని విడుదల చేశారు. ఈ సన్నివేశం జనాలకు బాగా ఆకర్షిస్తోంది. ఈ వీడియోకు నెటిజన్లు స్పందిస్తూ.. 'ఆడి పెద్ది సారొ.. ఆడు ఆడితే అలాగే ఉంటుంది' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వెంకట సతీష్ కిలారు భారీ నిర్మాణ విలువలతో నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణ భారతీయ చిత్రంగా నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఈ సినిమా అద్భుతంగా రన్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్ల నుంచి రూ. 500 కోట్ల దిశగా దూసుకెళుతోంది. మరి ఈ ఫీట్‌ని రామ్ చరణ్ సాధిస్తాడా? లేదా? అనేది ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోనుంది. ఎమోషన్స్, యాక్షన్, స్పోర్ట్స్ డ్రామా, పల్లెటూరి నేపథ్య కథనం.. ఇలాంటి అంశాల సమ్మేళనంగా వచ్చిన 'పెద్ది'కి నాన్ సీజన్‌లోనూ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రామ్ చరణ్ పవర్‌ఫుల్ నటనకు తోడు.. బుచ్చిబాబు సానా అందించిన ఎమోషనల్ కథనం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది.

ఇవి కూడా చదవండి:

మంచు విష్ణు 'కన్నప్ప' రీ రిలీజ్.. ఈ సారైనా?

'బెంగళూరు నాగరత్తమ్మ'.. సింగీతం ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చేదెవరో..

ప్రధాని మోదీ వీడియోలో.. అల్లు అర్జున్‌ AA23 థీమ్.. దేశవ్యాప్తంగా వైరల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy