Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సుకుమార్-  దేవిశ్రీ ప్రసాద్ కాంబోకి బ్రేక్? కారణమిదేనా?!

సుకుమార్- దేవిశ్రీ ప్రసాద్ కాంబోకి బ్రేక్? కారణమిదేనా?!

Chitrajyothy 3 weeks ago

టాలీవుడ్‌లో క్రేజీయెస్ట్ కాంబినేషన్లలో 'లెక్కల మాస్టర్' సుకుమార్ (Sukumar) - 'రాకింగ్ స్టార్' దేవిశ్రీ ప్రసాద్‌ (Rocking Star Devi Sri Prasad) జోడీ ఒకటి.

సుకుమార్ సినీ ప్రస్థానం ప్రారంభమైన 'ఆర్య' సినిమా నుంచి 'పుష్ప 2' వరకు ఆయన కెరీర్‌లోని ప్రతి చిత్రానికీ దేవిశ్రీ ప్రసాద్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. వీరి కలయికలో వచ్చిన అన్ని ఆల్బమ్స్ మ్యూజికల్ చార్ట్‌బస్టర్స్‌గా నిచాయి. ముఖ్యంగా 'పుష్ప' సిరీస్ చిత్రాలతో ఈ జోడీ సృష్టించిన మ్యూజికల్ సెన్సేషన్ టాలీవుడ్ హద్దులు దాటి పాన్ ఇండియా స్థాయిలో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.

అయితే, 'పుష్ప 2' (Pushpa 2) బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో వీరిద్దరి మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయనే ప్రచారం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపించింది. సమయాభావం వల్ల లేదా మరికొన్ని అంతర్గత కారణాల వల్ల కొన్ని కీలక సన్నివేశాల రీ-రికార్డింగ్ బాధ్యతలను ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్‌, సామ్ సి.ఎస్ కు అప్పగించాల్సి వచ్చింది. ఈ పరిణామంతో సుకుమార్, దేవిశ్రీల మధ్య గ్యాప్ వచ్చిందనే వార్తలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రాబోయే 'RC 17' ప్రాజెక్ట్ నుంచి దేవిశ్రీ ప్రసాద్‌ (DSP)ను పక్కనపెట్టనున్నట్లు ప్రచారం సాగింది. దేవి స్థానంలో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్‌దేవ్‌తో పాటు కోలీవుడ్ యంగ్ సెన్సేషన్స్ హర్షవర్ధన్ రామేశ్వర్ లేదా సాయి అభ్యంకర్‌ల పేర్లను సుకుమార్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

సినిమా మేకింగ్‌లో స్క్రిప్ట్ ఎంత ముఖ్యమో, దానికి ప్రాణం పోసే సంగీతం కూడా అంతే ముఖ్యమని నమ్మే దర్శకుడు సుకుమార్. తన సినిమాలను తన మ్యూజిక్‌తో ఎక్కడికో తీసుకెళ్లే దేవిశ్రీ లాంటి స్ట్రాంగ్ పిల్లర్‌ను, చిన్నచిన్న క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినంత మాత్రాన సుకుమార్ అంత సులభంగా వదులుకోరని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సుకుమార్ సినిమాలకు దేవిశ్రీ అందించే ట్యూన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రాణదాతగా నిలుస్తాయి. కాబట్టి, ఎలాంటి రూమర్స్ వచ్చినా రామ్ చరణ్‌తో సుకుమార్ చేయబోయే తదుపరి క్రేజీ ప్రాజెక్ట్‌కు కూడా దేవిశ్రీ ప్రసాద్‌నే సంగీత దర్శకుడిగా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. గతంలో రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'రంగస్థలం' ఇండస్ట్రీ హిట్ కావడంతో, వీరి రాబోయే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సుకుమార్ శైలి ప్రకారం ఆయన ప్రతి సీన్‌ను పర్ఫెక్ట్‌గా చెక్కడానికి చాలా సమయం తీసుకుంటారు. అందువల్లే, ఈ ప్రాజెక్ట్‌ను ముందే ప్రకటించినప్పటికీ కథను మరింత పకడ్బందీగా రూపొందించేందుకు సుకుమార్ టీమ్ సుదీర్ఘ కాలంగా కసరత్తు చేస్తోంది. మరోవైపు, 'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన గాయం కారణంగా రామ్ చరణ్ కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోనున్నారట. ఈ లెక్కన, మెగా పవర్‌స్టార్ - సుకుమార్ ల మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ఈ ఏడాది అక్టోబర్ తర్వాతే పట్టాలెక్కేలా కనిపిస్తోంది. ఈ కాంబో ఎప్పుడు వచ్చినా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.

ఇవి కూడా చదవండి:

ఇదే ఈ బాబాయ్- అబ్బాయ్ డెబ్యూ స్పెషాలిటీ!

అఖిల్ కోసం రంగంలోకి ఎన్టీఆర్? ఇక ఊహించుకోండి!

Varanasi: క్రేజీ ఫొటో.. రాముడిగా మహేష్ బాబు లుక్ ఇదేనా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy