Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టాలీవుడ్ మేకర్స్‌పై రాహుల్ రామకృష్ణ సెటైరికల్ పోస్ట్

టాలీవుడ్ మేకర్స్‌పై రాహుల్ రామకృష్ణ సెటైరికల్ పోస్ట్

Chitrajyothy 3 days ago

టాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna).. సమకాలీన అంశాలపై సోషల్ మీడియాలో స్పందించే తీరు ఎప్పుడూ భిన్నంగా, ఆలోచింపజేసేలా ఉంటుంది.

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ చిత్రాల ప్రచార సరళి, కాలేజీ ఈవెంట్లలో చేస్తున్న హడావుడి, మేకింగ్ పేరిట జరుగుతున్న వ్యవహారాలపై ఆయన ఎక్స్ వేదికగా వేసిన ఘాటైన వ్యంగ్యాస్త్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తొలుత టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సాంకేతికతను వాడుకునే విధానంపై రాహుల్ రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ''పరలోకంలో ఉన్న దేవుడా.. దయచేసి మన తెలుగు సినిమా మేకర్స్‌కు కాస్త వివరించు. ఏదైనా ఒక గ్రామం, పట్టణం, నగరం, తీరప్రాంతం, అడవి లేదా నదిపై పైనుంచి డ్రోన్ షాట్ తీసినంత మాత్రాన అది 'వరల్డ్ బిల్డింగ్' అయిపోదు! అది కేవలం ప్రొడక్షన్ బడ్జెట్‌తో కూడిన గూగుల్ ఎర్త్ మాత్రమేనని వారికి అర్థమయ్యేలా చెప్పు తండ్రీ'' అంటూ వ్యంగ్యంగా చురకలు అంటించారు.

ఇక ఇటీవల కాలంలో కాలేజీ ఈవెంట్లే లక్ష్యంగా సాగుతున్న సినిమా ప్రమోషన్ల ట్రెండ్‌పై రాహుల్ వేసిన సెటైర్ అయితే సూపర్బ్ అని చెప్పాల్సిందే. ''మై డియర్ higher power in heavens far above.. కాలేజీ టూర్లు అనేవి ప్రమోషన్లు కావని తెలుగు సినిమా మేకర్స్‌కి చెప్పయ్యా. సెల్ఫీల్లో కేరింతలు కొడుతూ అరుస్తున్న స్టూడెంట్స్ రేపు థియేటర్లకు వెళ్లి టికెట్లు కొనుక్కుంటారన్న గ్యారెంటీ ఏమీ లేదు. ట్విట్టర్, ఇన్‌స్టా, రెడ్డిట్‌లలో జరిగే ఫ్యాన్ వార్స్ బాక్సాఫీస్ కలెక్షన్లు కావు. డిజిటల్ మెట్రిక్స్ చూసి సినిమా హిట్ అవ్వదు. విడుదల రోజున థియేటర్ల దగ్గర పండగ చేసుకోవాల్సింది పోయి.. ఆఫీస్‌ల ముందు టపాసులు కాల్చడం ఏంటయ్యా? థియేటర్లలో జనం లేకపోతే అది విజయోత్సవం కాదు స్వామీ, ఓటమికి సౌండ్ ఎఫెక్ట్స్! సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వేరు.. బాక్సాఫీస్ దగ్గర టికెట్లు అమ్ముడవడం వేరు అనే నిజాన్ని మా మేకర్స్‌కి జ్ఞానోదయం కలిగించు తండ్రీ'' అంటూ రాసుకొచ్చారు.

రాహుల్ రామకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు, సినీ ప్రియులు ఏకీభవిస్తూ భారీగా మద్దతు తెలుపుతున్నారు. నిజంగానే గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి, సోషల్ మీడియా హైప్‌కు మధ్య ఉన్న తేడాను రాహుల్ కళ్లకు కట్టారని ప్రశంసిస్తున్నారు. ''ఇప్పటికైనా పీఆర్ స్టంట్లు, కాలేజీ గోలలు ఆపి.. కంటెంట్‌పై దృష్టి పెట్టండి'', ''భ్రమల్లో కాకుండా వాస్తవంలో బతకండిరా'' అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తుండటంతో ఈ పోస్టులు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

:

తలైవర్ మ్యాజిక్కే వేరు: 'జైలర్ 2' సక్సెస్‌పై నెల్సన్

ప్రభుత్వ లాంఛనాలతో.. ముగిసిన దేవా అంత్యక్రియలు

బాక్సాఫీస్ వద్ద 'రణబాలి' ర్యాంపేజ్.. తెలుగు రాష్ట్రాల్లో 'విరోష్' సందడి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy