హైదరాబాద్‌కు చెందిన తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని అన్నారు హీరోయిన్ పాయల్. ఇక్కడ పాయల్ అనగానే అంతా 'ఆర్ఎక్స్ 100' పాయల్ రాజ్‌పుత్ అనుకుంటారేమో..
ఆమె కాదు. ఇటీవల వచ్చిన 'పాపం ప్రతాప్' సినిమాలో హీరోయిన్‌గా నటించిన పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna). త్రిగుణ్ (Thrigun) హీరోగా, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా.. అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రలో నటించిన ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' (Mr. Work From Home). ఈ చిత్రం మే 15న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలయ్యేందుకు ముస్తాబైంది. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అరవింద్ మండ్యం లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై నిర్మించారు. CH.V.S.N బాబ్జీ సమర్పిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ..
''ఆదిత్ (త్రిగుణ్) ఈ సినిమా గురించి చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఈ ఇయర్‌లో ఆల్రెడీ నేను నటించిన 'పాపం ప్రతాప్' రిలీజ్ అయింది.. ఇప్పుడు 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' రిలీజ్ అవుతుంది. మరో ప్రాజెక్ట్ రెడీ అవుతోంది.. ఫ్రాన్స్‌లో షూట్ చేశాం.. జూలైలో రిలీజ్ కావచ్చు. ఒకే ఇయర్‌లో ఇన్ని రిలీజెస్ ఉండటం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను తెలుగు నేర్చుకునేటప్పుడు డబ్బింగ్ కోసం నేర్చుకున్నాను. సార్ చెప్పినట్టు.. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నాకసలు తెలుగు తెలీదు. కానీ, ఇప్పుడు తెలుగు పర్సనల్‌గా మారింది. అదే లవ్‌లో ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఉన్నంత ఫీల్ నాకు ఎక్కడా రాదు. ఐ జస్ట్ వాంట్ టు స్టే హియర్. ఒకే ఇయర్‌లో ఇన్ని తెలుగు ఫిల్మ్స్ చేస్తూ ఉంటే.. ఇలాగే కంటిన్యూ అవ్వాలి, మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలి. భవిష్యత్తులో ఇక్కడే ఉండిపోతానేమో.. తెలియదు. (మధ్యలో తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా.. అని హీరో త్రిగుణ్ అడగడానే..)

