Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tollywood: పర్శంటేజ్‌ పై ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ షరతులు!

Tollywood: పర్శంటేజ్‌ పై ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ షరతులు!

Chitrajyothy 1 month ago

తెలుగు సినిమా ప్రదర్శనకు సంబంధించి ఉప సంఘంలోని నిర్మాతలు, పంపిణీదారులు తమ నిబంధనలు, షరతులను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ కు ఈ నెల 23న ఓ లేఖరూపంలో అందించారు.

మరి ఇందులో ఏ యే అంశాలను ఛాంబర్‌... ఎగ్జిబిటర్స్ తో కలిసి చర్చించి, అమలులోకి తీసుకొస్తుందో చూడాలి.

వారు పేర్కొన్న నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి. అయితే ఈ నిబంధనలు కేవలం సినిమా హాళ్లను స్వంతంగా కలిగి నిర్వహిస్తున్న, ఛాంబర్‌లో నమోదైన స్వతంత్ర ఎగ్జిబిటర్లకు మాత్రమే వర్తిస్తాయని, మూడో పక్ష థియేటర్ లీజుదారులు లేదా కార్పొరేట్ మధ్యవర్తులకు ఇవి వర్తించవు వారు పేర్కొన్నారు.

ఆదాయ భాగస్వామ్య శ్లాబులు, చర్చల ప్రమాణాలు

ఆదాయ భాగస్వామ్యానికి ప్రాథమిక శాతం శ్లాబులు ఈ విధంగా ఉంటాయి: శ్లాబులు: 85% | 75% | 70% | 65% | 60%

పంపిణీదారుడి విచక్షణాధికారం: సినిమా సామర్థ్యం, భౌగోళిక ప్రాంతం, థియేటర్ గ్రేడ్ వంటి అంశాల ఆధారంగా పై శ్లాబులలో ఏ శాతం వర్తించాలో పంపిణీదారుడు నిర్ణయించి చర్చించవచ్చు.

రన్ ఆధారిత సవరణలు: సినిమా ప్రదర్శన వారం (Run Week), పరస్పర అంగీకారంతో నిర్ణయించే ఇతర థియేట్రికల్ నిబంధనల ఆధారంగా కూడా శాతం నిబంధనలను పంపిణీదారుడు చర్చించి నిర్ణయించవచ్చు.

ప్రధాన నిర్వహణ & ఆర్థిక నిబంధనలు

1. పారదర్శకత: టికెట్ విక్రయాలకు సంబంధించి పూర్తి పారదర్శకత ఉండాలని పంపిణీదారుడు నిర్ధారించాలి. ఎగ్జిబిటర్లు ప్రతి షోకు సంబంధించిన ఖచ్చితమైన, ధృవీకరించదగిన టికెట్ విక్రయ వివరాలను అందించాలి.

2. వి.పి.ఎఫ్‌. సమస్యల తక్షణ పరిష్కారం: వర్చువల్ ప్రింట్ ఫీ (VPF), డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ (DSP) ఖర్చులకు సంబంధించిన వివరాలు పూర్తిగా పారదర్శకంగా ఉండాలి. వీటికి సంబంధించిన పెండింగ్ వివాదాలను వెంటనే పరిష్కరించాలి.

3. టికెటింగ్ ప్లాట్‌ఫారమ్ ఛార్జీలు: ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్‌ల కన్వీనియెన్స్ ఫీజులు, సాఫ్ట్‌వేర్ ఛార్జీలను స్పష్టంగా లెక్కించి, ఆదాయ నమూనాలో సరళీకృతంగా చేర్చాలి.

4. నిర్వహణ వ్యయాల పరిమితి: అధిక నిర్వహణ ఖర్చులను నివారించేందుకు థియేటర్ నిర్వహణ వ్యయాలకు గరిష్ట పరిమితి (Cap) విధించాలి. చెల్లుబాటు అయ్యే అన్ని నిర్వహణ ఖర్చులను అంగీకరించిన ఆదాయ శాతం ప్రకారం పంచుకోవాలి. ఈ ఖర్చులను పంపిణీదారుడు ధృవీకరించి ఆమోదించాలి.

5. బండ్లింగ్ & థియేటర్ కేటాయింపు: సినిమాల బండ్లింగ్, విడుదలకు కేటాయించే థియేటర్ల సంఖ్యకు సంబంధించిన నిబంధనలు, ఎగ్జిబిటర్, పంపిణీదారుడి మధ్య ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారమే కొనసాగుతాయి.

6. చిన్న చిత్రాలకు: చిన్న సినిమాల ప్రదర్శనకు అవకాశం కల్పించేందుకు నిర్మాతలు రోజుకు 5వ షో నిర్వహించేలా షెడ్యూల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

7. నిర్వహణ & బాధ్యత: థియేటర్ స్థాయిలో జరిగే పైరసీ నియంత్రణకు ఎగ్జిబిటర్లు పూర్తి బాధ్యత వహించాలి. ప్రదర్శనల సమయంలో తగిన భద్రతా చర్యలు, నిఘా వ్యవస్థలను నిర్వహించాలి.

8. ప్రేక్షకులకు అందుబాటు ధరల్లో సౌకర్యాలు: సినిమా ప్రేక్షకుల సంఖ్య తగ్గకుండా ఉండేందుకు ఫుడ్ & బెవరేజెస్ (F&B), పార్కింగ్, ఇతర అవసరమైన సౌకర్యాలకు సహేతుకమైన ధరలు నిర్ణయించి అందుబాటులో ఉంచాలి.

9. కొత్త ఫార్మాట్‌ల ఖర్చులు & ఆదాయం: ప్రత్యేక త్రీడీ, ప్రీమియం లార్జ్ ఫార్మాట్‌లు లేదా అధునాతన ఆడియో సిస్టమ్‌లు వంటి ప్రత్యేక ప్రదర్శన విధానాల వల్ల వచ్చే అదనపు ఖర్చులు, ప్రీమియం టికెట్ ఆదాయాలను స్పష్టంగా వివరించి, పంపిణీదారుడితో పరస్పర అంగీకారంతో నిర్ణయించాలి.

పంపిణీదారుడు మార్కెట్లో నిర్మాతల ఆర్థిక, సృజనాత్మక ప్రయోజనాలకు ప్రతినిధిగా వ్యవహరిస్తారు. పై పేర్కొన్న అంశాలపై తమ తరఫున చర్చించి నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని పంపిణీదారులకు నిర్మాతలు ఇస్తున్నట్లు ధృవీకరిస్తున్నారు.

అయితే ఈ ఉపకమిటీలోని నిర్మాతలు, పంపిణీదారులు ఇచ్చిన సూచనలు, షరతులు ఎంతవరకూ కార్యరూపం దాల్చుతాయనేది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

లీగల్ వివాదంలో ప్రభాస్ 'స్పిరిట్'.. టైటిల్ మార్చాల్సిందేనా?

పీఆర్ స్టంట్స్.. పిక్చర్స్‌కు పనికొచ్చేనా..!

'పెద్ది' సక్సెస్ చూసి నాకు 'ఠాగూర్'లోని డైలాగ్ గుర్తొచ్చింది: రామ్ చరణ్

Dharman: తలైవర్ 173 టైటిల్ ఖరారు.. రఫ్పాడించేస్తోన్న ఫస్ట్ లుక్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy