Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tom Cruise: తెలుగు యువ దర్శకుడితో టామ్ క్రూజ్ భారీ చిత్రం!

Tom Cruise: తెలుగు యువ దర్శకుడితో టామ్ క్రూజ్ భారీ చిత్రం!

Chitrajyothy 1 week ago

హాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్ (Tom Cruise) తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. 'మిషన్ ఇంపాజిబుల్' వంటి భారీ ఫ్రాంచైజీకి ముగింపు పలికిన ఆయన, ఇప్పుడు 'డూపెల్‌గాంగర్' అనే ఇంట్రెస్టింగ్ స్పై థ్రిల్లర్‌తో అలరించబోతున్నారనేలా అంతర్జాతీయ మీడియాలో వార్తలు హైలెట్ అవుతున్నాయి.

విశేషం ఏమిటంటే.. ఈ ప్రాజెక్ట్‌ను మన తెలుగు మూలాలున్న యువ దర్శకుడు అనీష్ చాగంటి (Aneesh Chaganty) తెరకెక్కించనుండటం. 2018లో వచ్చిన 'సెర్చింగ్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనీష్, ఇప్పుడు హాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్‌ను డైరెక్ట్ చేసే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నట్లుగా టాక్ నడుస్తోంది. 27 ఏళ్ళ వయసులోనే ఒక సినిమా తీసి సూపర్ హిట్ కొట్టి 75 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టిన అనీష్ చాగంటి తెలుగువాడు కావడం విశేషం.

అనీష్ చాగంటి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న 'డూపెల్‌గాంగర్' చిత్రంలో టామ్ క్రూజ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం. ఆయన ఇందులో 'వీర్' అనే CIA ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారని.. రష్యా ఇంటెలిజెన్స్ సంస్థ తనను పోలిన వ్యక్తిని తయారు చేసిందని తెలుసుకున్న తర్వాత ఆ ఏజెంట్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. వింటేజ్ టామ్ క్రూజ్ శైలిలో సాగే ఈ స్పై థ్రిల్లర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు ర్యాన్ కూగ్లర్, జింజీ కూగ్లర్, సెవ్ ఒహానియన్‌లతో కలిసి అనీష్ చాగంటి స్వయంగా నిర్మిస్తున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

టామ్ క్రూజ్ ప్రస్తుతం 'ద ఫైనల్ రికనింగ్' షూటింగ్‌ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. మరోవైపు, ఈ ఏడాది చివర్లో ఆయన నటించిన 'డిగ్గర్' అనే సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అనీష్ చాగంటి విషయానికి వస్తే.. ఆయన తల్లిదండ్రులు 1980వ దశకంలో ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వెళ్లారు. షార్ట్ ఫిల్మ్స్‌తో మొదలై.. హాలీవుడ్‌లో తనదైన ముద్ర వేస్తున్న అనీష్, ఇప్పుడు టామ్ క్రూజ్ వంటి సెన్సేషనల్ స్టార్‌ను డైరెక్ట్ చేయనుండటం తెలుగు వారికి గర్వకారణమనే చెప్పుకోవాలి. చూద్దాం మరి.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో..?

ఇవి కూడా చదవండి:

Tollywood: డూప్లికేట్ జుత్తు, పాము.. సునీల్ నారంగ్ వర్సెస్ నాగవంశీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy