Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'వారణాసి'.. జక్కన్న ఇచ్చిన మాస్ అప్‌డేట్ ఇదే!

'వారణాసి'.. జక్కన్న ఇచ్చిన మాస్ అప్‌డేట్ ఇదే!

Chitrajyothy 2 weeks ago

ర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ 'వారణాసి' (Varanasi).

'ఆర్ఆర్ఆర్' సాధించిన అంతర్జాతీయ ఘనవిజయం తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మేకింగ్‌పై స్పందించిన రాజమౌళి, విజువల్స్ పరంగా ఈ చిత్రం ఏ స్థాయిలో ఉండబోతోందో వివరిస్తూ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు.

ఈ సినిమాను ప్రతిష్టాత్మక ఐమాక్స్ ఫార్మాట్‌లో ఎందుకు తెరకెక్కిస్తున్నారో రాజమౌళి తొలిసారిగా వివరిస్తూ ఒక ప్రముఖ అంతర్జాతీయ ఫిల్మ్ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 'వారణాసి' కథలోని అత్యంత అరుదైన విజువల్ ఎలిమెంట్స్ సాధారణ స్క్రీన్ల కంటే ఐమాక్స్ తెరపైనే ప్రేక్షకులకు సంపూర్ణమైన అనుభూతిని ఇస్తాయని ఆయన చెప్పారు. ప్రతి సన్నివేశాన్ని అత్యంత సహజంగా, అద్భుతంగా డిజైన్ చేశామని, అందుకే సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఐమాక్స్ ఫార్మాట్‌నే ఎంచుకున్నామని తెలిపారు. సినిమాలోని లొకేషన్ల గురించి చెబుతూ, అంటార్కిటికాలోని దాదాపు 300 అడుగుల ఎత్తైన మంచు కొండలు, విశాలమైన మంచు ప్రాంతాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఒక మాయా ప్రపంచంలోకి తీసుకెళ్తాయని రాజమౌళి వివరించారు. థియేటర్‌లో ఈ దృశ్యాలు చూస్తున్నప్పుడు ప్రేక్షకులు నిజంగా ఆ మంచు కొండల్లో ఉన్నట్టే అనుభూతి చెందుతారన్నారు. దీనితో పాటు, రామాయణంలోని వానర సేనల స్ఫూర్తితో రూపొందించిన భారీ యుద్ధ సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని, వేలాది మంది యోధులతో కూడిన ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను ఐమాక్స్ తెరపై చూస్తే నేరుగా యుద్ధభూమిలో ఉన్న భావన కలగడం ఖాయమని స్పష్టం చేశారు.

ప్రస్తుతం 'వారణాసి' చిత్రీకరణ వేగంగా సాగుతోంది. ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయిందని జక్కన్న వెల్లడించారు. మిగిలిన చిత్రీకరణ ముగియగానే ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఏకకాలంలో పూర్తి చేసేలా ప్లాన్ చేసినట్లు చెప్పారు. ఇక విజువల్ ఎఫెక్ట్స్ పనులను సైతం ఎప్పటికప్పుడు వేగవంతం చేస్తూ.. వచ్చే ఏడాది ఈ గ్రాండ్ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మరి మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో రాబోతున్న ఈ విజువల్ వండర్ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

కీర్తి రెడ్డితో విడాకులకు కారణమిదే: సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

జానీ మాస్టర్ వైఫ్ సుమలత తీరుపై ఫెడరేషన్, నిర్మాతలు తీవ్ర ఆగ్రహం

'అనకాపల్లి'కి రియల్ హీరో సోనూ సూద్ సపోర్ట్.. ఏం చేశారంటే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy