Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెంకీ, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి సినిమాకు క్లాప్ ఎవరు కొట్టారంటే

వెంకీ, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి సినిమాకు క్లాప్ ఎవరు కొట్టారంటే

Chitrajyothy 6 days ago

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram), బ్లాక్‌బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ ఫెస్టివల్ ఎంటర్‌టైనర్‌ చిత్రం #VenkyAnil5 #NKRAR2. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన సమర్పణలో, జీ స్టూడియోస్ సహనిర్మాణంలో..

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి (Sahu Garapati) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2027 సంక్రాంతి టార్గెట్‌గా రానున్న ఈ మూవీ గురువారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు (K Raghavendra Rao) ఆధ్వర్యంలో సక్సెస్ ఫుల్ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) క్లాప్ కొట్టారు.

నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ చిత్రయూనిట్‌కు స్ర్కిప్ట్ అందించి ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. క్లాప్ సన్నివేశం విషయానికి వస్తే.. కీర్తి సురేష్‌పై కళ్యాణ్ రామ్, కృతి శెట్టిపై వెంకటేష్ చేతులు వేసుకుని నిలబడి ఉండగా.. క్లాప్ పడింది. అయ్యో ఇదేంటి.. అని వెంకీ, కళ్యాణ్ రామ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోగా వెంటనే హీరోయిన్లు తమ ప్లేస్‌లను మార్చుకున్నారు. వెంకీ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి ఇందులో నటిస్తున్నారు. ఈ ఫస్ట్ షాట్‌కు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత డి. సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ఇక ఈ సినిమాకు దక్షిణ భారత సినీ పరిశ్రమలో అగ్ర సంగీత దర్శకుల్లో ఒకరైన జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ రీసెంట్‌గా విడుదలైన ఓ వీడియో ఎలా వైరల్ అయిందో తెలియంది కాదు. ఈ ప్రాజెక్ట్‌లో జీవీ ప్రకాష్ కుమార్ భాగమైన విషయాన్ని ప్రత్యేకంగా, వినోదాత్మకంగా ప్రకటిస్తూ మేకర్స్ అనిల్ రావిపూడి స్టైల్‌లో వచ్చిన ఈ ఫన్‌ఫుల్ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉంది. ఈ వీడియో ద్వారా ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ కూడా ఈ చిత్ర బృందంలో భాగమని అధికారికంగా ప్రకటించారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించే వినోదాత్మక చిత్రాలను అందించడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనిల్ రావిపూడి, ఈ చిత్రాన్ని నవ్వులు, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు, అందరికీ దగ్గరగా అనిపించే పాత్రలతో కూడిన పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబోతోన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు 'జనవరి 13న విడుదల' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

ఇవి కూడా చదవండి:

Jana Nayagan: సీఎం అయినా విడుదల కాని సినిమా.. ఈసారి రెండు డేట్స్!

సోలో హీరోగా 400 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్.. ఆడు 'పెద్ది' సారొ!

'బెంగళూరు నాగరత్తమ్మ'.. సింగీతం ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చేదెవరో..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy