Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెంకీ కోసం చేసిన పాటలు.. ఉదయ్ కిరణ్ సినిమాకు వాడేశారు

వెంకీ కోసం చేసిన పాటలు.. ఉదయ్ కిరణ్ సినిమాకు వాడేశారు

Chitrajyothy 3 weeks ago

కరితో అనుకున్న సినిమా మరొకరితో చేయడం సినిమా ఇండస్ట్రీలో కొత్తేం కాదు. అలా చాలా సినిమాలు చేతులు మారాయి. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్-పూరి కాంబినేషన్‌లో రావాల్సిన చాలా సినిమాలు మహేష్ బాబు, రవితేజ చేతుల్లోకి వెళ్లాయి.

అలా చేతులు మారడానికి అనేక కారణాలు ఉంటాయి. మరోవైపు ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ అనుకుని కూడా తెరకెక్కని సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), డైరెక్టర్ తేజ కాంబో మూవీ కూడా ఒకటి. అప్పట్లో తేజ (Director Teja) సక్సెస్ రేట్ చూసి, స్టార్ హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. అలా వెంకీతో తేజ దర్శకత్వంలో ఓ సినిమాను ప్లాన్ చేశారు. కానీ, పట్టాలెక్కలేదు. ఆ సినిమాకు అనుకున్న పాటలను తేజ.. తన తదుపరి హీరో సినిమాలో వాడి.. మరో సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

'చిత్రం' సక్సెస్‌తో తేజ పేరు అప్పట్లో టాలీవుడ్‌లో సెన్సేషన్ అయింది. ఆ సినిమా తర్వాత వెంటనే విక్టరీ వెంకటేష్‌తో తేజ దర్శకత్వంలో 'సావిత్రి' పేరుతో సినిమా చేసేందుకు జెమిని కిరణ్ ప్లాన్ చేశారు. కథ కూడా సిద్ధం చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించారు. కానీ, వెంకటేష్ చివరి నిమిషంలో హ్యాండిచ్చారు. వెంకటేష్‌కు విజయభాస్కర్ దర్శకత్వంలో 'నువ్వు నాకు నచ్చావ్' అనే స్టోరీ ఓకే అవడంతో.. తేజ సినిమా వదులుకుని ఆ సినిమాకు ఆయన కమిట్ అయ్యారు. దీంతో తేజ.. మళ్లీ తన ఫస్ట్ చిత్రం హీరోతోనే సినిమా చేసుకోవాల్సి వచ్చింది.

వెంకీతో సినిమా ఓకే అవుతుందని ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలెట్టిన తేజ.. అప్పటికే ఆర్పీతో రెండు పాటలు కూడా రికార్డ్ చేయించడంతో.. ఆ పాటలను తన తదుపరి సినిమాలో వాడేసుకున్నారు. ఆ సినిమా మరేదో కాదు.. ఉదయ్ కిరణ్ నటించిన 'నువ్వు నేను'. వెంకీ సినిమా కోసం 'గాజు వాక పిల్ల' సాంగ్‌తో పాటు, 'తుమ్మెద ఓ తుమ్మెద' అనే సాంగ్‌ని తేజ రెడీ చేయించారు. 'గాజు వాక పిల్ల' సాంగ్‌ని యాజీటీజ్‌గా వాడేసిన తేజ, 'తుమ్మెద ఓ తుమ్మెద' అనే పాటను 'ప్రియతమా ఓ ప్రియతమా'గా మార్చి సినిమాలో యూజ్ చేసుకున్నారు. ఈ రెండు పాటలు అప్పట్లో సంచలనాన్ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తేజ చేసిన 'నువ్వు నేను', వెంకీ చేసిన 'నువ్వు నాకు నచ్చావ్'.. రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ని అందుకున్నాయి.

ఇవి కూడా చదవండి:

వైజయంతీ మూవీస్ బ్యానర్ రూటే వేరు.. బ్రాండ్ అంటే ఇది!

PKCW: సినీ ఆశావహులకు పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్

'అంబ'స్ రివెంజ్'.. ఈ సినిమా స్పెషల్ ఏంటో తెలుసా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy