Dailyhunt
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

FilmyFocus 5 days ago

డివి శేష్..కి(Adivi Sesh) సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. సినీ పరిశ్రమలో ఉన్న పోటీ వాతావరణం అలాగే ఇగో వంటి అంశాలని వివరిస్తూ అడివి శేష్ ఆ వీడియోలో స్పందించడం జరిగింది.

Adivi Sesh

ఒక సినిమా ఫంక్షన్‌లో అడివి శేష్ తో మరో హీరో ‘నేను చేస్తున్న పెద్ద సినిమాలు(పాన్ ఇండియా సినిమాలు) నువ్వు ఎప్పుడు చేస్తావు?’ అని అడిగాడట. తెలుగులో చెబితే ఆ హీరో ఎవరో అర్ధమైపోతుంది అని భావించి ఇంగ్లీష్ లో రివీల్ చేస్తున్నట్టు అడివి శేష్ చెప్పుకొచ్చాడు.

ఇక ఆ హీరో మాటలు విన్నాక నువ్వు ..’నువ్వు నీ కుళ్ళు బుద్ది’ అని శేష్ తన మనసులో అనుకున్నాడట. దీనినే అతను ‘మెజరింగ్ కాంటెస్ట్’ (ఎవరి ఇమేజ్ పెద్దది అంటూ కోలుచువడం) అని భావించాడట. ఈ ఆటిట్యూడ్ అనేది తనని సంతృప్తిపరచదని అడివి శేష్ చెప్పుకొచ్చాడు.పోటీ వాతావరణానికి అంతం అనేది ఉండదు అని కూడా శేష్ చెప్పుకొచ్చాడు.

‘యువ హీరోల కంటే గొప్పవారమనుకుంటే, అక్కడ ఆరుగురు పెద్ద హీరోలు ఉంటారు అని,వారిని దాటితే రజినీకాంత్, చిరంజీవి ఉన్నారని.. వాళ్ళని కూడా మించితే షారుఖ్ ఖాన్… గ్లోబల్ లెవల్ కి వెళ్ళి చూస్తే టామ్ క్రూజ్ వంటి వారు ఉన్నారని’ శేష్ వివరించాడు. ఫైనల్ గా ‘పోటీ వాతావరణం అనేది మంచిదే కానీ ఎదుటివారి సక్సెస్ ని చూసి ఈర్ష్య పడటం.. వాళ్ళని తక్కువ చేయడం సరైనది కాదు’ అనేది శేష్ అభిప్రాయం.

నిజంగా అతని మాటలకి, పద్దతికి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే. కాకపోతే శేష్ ని తక్కువ చేసి మాట్లాడిన ఆ హీరో(పాన్ ఇండియా హీరో) ఎవరా? అని సోషల్ మీడియాలో చాలా మంది నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు నిఖిల్ అని, ఇంకొందరు తేజ సజ్జా అంటూ అభిప్రాయపడుతున్నారు.

మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన 'బైకర్'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu