Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

FilmyFocus 3 weeks ago

క సినిమా గురించి ప్రేక్షకులు ఎప్పుడూ మాట్లాడుకోవాలంటే రెండు దారులు ఉన్నాయి. ఒకటి సినిమా గురించి తరచూ అధికారికంగా సమాచారం ఇవ్వడం, మరొకటి ఏ సమాచారం అధికారికంగా చెప్పకుండా..

లీకులు ఇవ్వడం, లేదంటే మీరూ ఊహించేసుకోండి అని చెప్పడం. ఇప్పుడు ఈ రెండో దారిని పక్కాగా వినియోగిస్తున్న సినిమా 'రాకా'. ఈ విషయంలో మాకు తెలిసి ఎవరికీ ఎలాంటి డౌట్‌ ఉండదు. ఎందుకంటే ఆ సినిమా టీమ్‌ చేసే పనులు అలా ఉన్నాయి మరి.

Raaka

సినిమా గురించ ఇప్పటివరకు బయటకు వచ్చిన సమాచారం ఏదైనా ఉందా అంటే.. అది హీరో అల్లు అర్జున్‌ అని, ఒక హీరోయిన్‌ దీపికా పడుకొణె అని, దర్శకుడు అట్లీ అని. ఇక నిర్మాత సన్‌ పిక్చర్స్‌ అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మాటలు కాకుండా ఇప్పటివరకు చాలా రకాల పుకార్లు వచ్చాయి. మృణాల్‌ ఠాకూర్‌, జాన్వీ కపూర్‌ రష్మిక మందన లాంటి వాళ్లు నటిస్తున్నారు అనేది పుకార్లు మాత్రమే. ఇప్పటివరకు టీమ్‌ ఎక్కడా ఈ విషయం చెప్పలేదు. ఆ హీరోయిన్ల పుట్టిన రోజుల సందర్భంలో అయినా ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసి విషెష్‌ చెప్పి ప్రేక్షకులకు క్లారిటీ ఇస్తారు అనుకుంటే అది కూడా జరగడం లేదు.

ఈ లోపు కొత్త కొత్త పుకార్లు బయటకు వస్తున్నాయి. అందుకే ఒకటి 'రాకా' సినిమా ఒకటి కాదు, రెండు అని అంటున్నారు. అంటే సినిమా రెండు ముక్కలు చేస్తున్నారని టాక్‌. 'పుష్ప'కి వచ్చిన క్రేజ్‌ని పట్టుకుని సినిమాను లాగి లాగి రెండు ముక్కలు చేసినట్లే ఇప్పుడు 'రాకా'ని 'రా. . . . . . కా' అంటూ సాగదీసి రెండు చేస్తారట. ఇదంతా పెట్టుబడిని వెనక్కి తెచ్చుకునే ప్రయత్నమే అని అంటున్నారు. ఈ విషయంలో సినిమా టీమ్‌ ఇప్పటికప్పుడు ఎలాంటి సమాచారం ఇచ్చే అవకాశం లేదు. అయితే ప్రచారంలో కానీ, సినిమా ముగింపులో కానీ చెబుతారు.

ఇది కాకుండా మరో పెద్ద పుకారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని. ఈ విషయంలో పెద్దగా క్లారిటీల కోసం ఆలోచించక్కర్లేదు. ఒకటి రెగ్యులర్‌ హీరో అయితే, రెండోది ఆ జంతువు చెయ్యి ఉన్న పాత్ర. వీటి వచ్చే నెల అంటే ఆగస్టు క్లారిటీ వస్తుంది అంటున్నారు. ఓ వీడియో రిలీజ్‌ చేసి సినిమా స్థాయి ఏంటో చూపించాలి అనుకుంటున్నారు. అప్పుడు ఈ రూమర్లపై క్లారిటీ వస్తుంది.

'రామాయణ'లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu