Dailyhunt
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

FilmyFocus 5 days ago

నేచురల్ స్టార్ నాని 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతోన్న మరో సెన్సేషనల్ మూవీ 'ది పారడైజ్'(The Paradise). ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వాస్తవానికి మార్చి 26న ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని ప్రకటించారు.

The Paradise

కానీ షూటింగ్ ఆలస్యం అవుతున్న కరణంగా ఆగష్టు 21 కి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ డేట్ కూడా డౌటే అనే టాక్ వినిపిస్తోంది. అవును ఈ భారీ యాక్షన్ డ్రామా మరోసారి వాయిదా పడనుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలోని పవర్ ఫుల్ క్యారెక్టర్ కోసం నాని తన మేకోవర్ పూర్తిగా మార్చేశాడు. ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుని మరీ కండలు పెంచాడు.ఈ మధ్యనే ‘ఆయా షేర్’ అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అనిరుథ్ సంగీతం అందించాడు.ఇదిలా ఉంటే… ఇప్పటివరకు ఈ మూవీకి సంబంధించి కేవలం 50 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయిందట. ఇంకా చాలా కీలకమైన ఎపిసోడ్స్ తెరకెక్కించాల్సి ఉందట.ఈ లెక్కన చూసుకుంటే ఆగస్టు రిలీజ్ కూడా దాదాపు కష్టంగానే కనిపిస్తుంది అని ఇండస్ట్రీ పెద్దలు చెబుతున్నారు.

షూటింగ్ డిలేస్ ఒక ఎత్తు అయితే.. ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న రాక్‌స్టార్ అనిరుధ్ ఫ్యాక్టర్ మరో ఎత్తు. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ , రీ-రికార్డింగ్ వర్క్ కంప్లీట్ చేయడానికి చాలా టైమ్ తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. ఈ కారణాల వల్లే మేకర్స్ రిలీజ్ డేట్‌ను ఏకంగా డిసెంబర్‌కు షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. సుధాకర్ చెరుకూరి తన ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కయాడు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది.

'డెకాయిట్' బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu