Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

FilmyFocus 3 weeks ago

మిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్(Vijay) సృష్టించిన సునామీ కోలీవుడ్, పాలిటిక్స్ వర్గాలను షేక్ చేస్తోంది. సొంతంగా పార్టీ పెట్టి తొలి ప్రయత్నంలోనే ఏకంగా 108 సీట్లు సాధించి..

అతిపెద్ద పార్టీగా అవతరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్.

Vijay

మేజిక్ ఫిగర్‌ (118)కు పది సీట్ల దూరంలో నిలిచి హంగ్ ఏర్పడటంతో.. విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారనే ఉత్కంఠ నడుస్తోంది.సరిగ్గా ఈ ఎలక్షన్ రిజల్ట్స్ రోజే సౌత్ క్వీన్ త్రిష తన 44వ పుట్టినరోజు జరుపుకోవడం, తిరుమల దర్శనం తర్వాత నేరుగా వెళ్లి విజయ్‌కి అభినందనలు తెలపడంతో నెట్టింట వీరిద్దరి హ్యాష్‌టాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.

ఈ సెన్సేషన్ మధ్య.. రాజకీయంగానే కాకుండా వందల కోట్లలో ఉన్న వీరిద్దరి ఆస్తుల లెక్కల గురించి ఇప్పుడు నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు.ముఖ్యమంత్రి పీఠానికి అత్యంత చేరువలో ఉన్న విజయ్.. ఈ ఎన్నికల బరిలోకి దిగుతూ ఈసీ (EC)కి సబ్మిట్ చేసిన అఫిడవిట్ చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఔట్ అవ్వాల్సిందే.

ఆ లెక్కల ప్రకారం విజయ్ మొత్తం ఆస్తుల విలువ ఏకంగా రూ.624 కోట్లు. ఇందులో బ్యాంకు బ్యాలెన్స్, షేర్స్, లగ్జరీ కార్ల రూపంలో ఉన్న చరాస్తులు రూ.404.58 కోట్లు కాగా.. చెన్నైలోని సాలిగ్రామం, నీలాంకరై లాంటి కాస్ట్లీ ఏరియాల్లో ఉన్న బంగ్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల (స్థిరాస్తుల) విలువ రూ.220.15 కోట్లుగా చూపించారు.

కేవలం ఆస్తులే కాదు.. విజయ్ పేరిట 883 గ్రాముల గోల్డ్ ఉండగా, ఆయన భార్య సంగీత పేరిట సుమారు 3 కేజీల వరకు బంగారం, డైమండ్స్ ఉన్నట్లు అఫిడవిట్‌లో తేలింది. ‘రోల్స్ రాయిస్ ఘోస్ట్’ దగ్గరి నుంచి ఆడి, బీఎమ్‌డబ్ల్యూ లాంటి ప్రపంచస్థాయి కార్లు అతని గ్యారేజీలో ఉన్నాయి. ఇక 2024-25 ఫైనాన్షియల్ ఇయర్‌కు సంబంధించి తన యాన్యువల్ ఇన్‌కమ్ ఏకంగా రూ.184.53 కోట్లుగా ఈ టీవీకే అధినేత ప్రకటించడం గమనార్హం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu