హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రణబాలి. ఈ సినిమా నుండి కీలకమైన యాక్షన్ సీన్ లీక్ కావడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌లోని ఆనంతపూర్ జిల్లాలోని ఎల్లనూర్ మండలంలో షూటింగ్ జరుపుకుంటోంది.
లీక్ అయిన వీడియోలో విజయ్ దేవరకొండ గుర్రంపై స్వారీ చేస్తూ, ప్రత్యర్థులను తీవ్రంగా ఎదుర్కొనే యాక్షన్ సీన్ కనిపించింది. భారీ యాక్షన్ సెటప్‌తో తెరకెక్కుతున్న ఈ సన్నివేశంలో ఆయన స్టైల్, ఎనర్జీ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో సినిమా యూనిట్ అప్రమత్తమైంది. ముఖ్యంగా, కీలకమైన యాక్షన్ సీన్‌తో పాటు కొన్ని డైలాగ్స్ కూడా బయటకు రావడం నిర్మాతలు, దర్శకుడిని ఆందోళనకు గురి చేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వేగంగా వైరల్ కావడంతో, చిత్ర బృందం వెంటనే భద్రతా చర్యలు కఠినతరం చేసింది.
ఇకపై షూటింగ్ జరుగుతున్న ప్రదేశాల్లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించే అవకాశముందని సమాచారం. లీకుల వల్ల సినిమా కంటెంట్ ప్రభావితం కాకుండా ఉండేందుకు యూనిట్ కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా ఆలోచిస్తోంది.
ALso Read:బీజేపీలో చేరిన ఆప్ నేత ఫూల్కా!