Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
MLA Kadiyam Srihari | జీవో 97ను రద్దు చేయాలి  : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

MLA Kadiyam Srihari | జీవో 97ను రద్దు చేయాలి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

MLA Kadiyam Srihari | జీవో 97 రద్దు చేయాలని ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కడియం శ్రీహరి మాట్లాడుతూ..

మాజీ విద్యాశాఖ మంత్రిగా జీవో 97ను రద్దు చేయాలి. పాలిటెక్నిక్‌ ఎడ్యుకేషన్‌ను ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్‌తో కలిపే ఉంచాలని డిమాండ్ చేస్తున్నానన్నారు.

పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్‌ను లేబర్‌ అండ్ ఎంప్లాయిమెంట్ కిందకు తీసుకురావొద్దు.. తద్వారా విద్యార్థులకు లేని అపోహలు ఏర్పడుతున్నాయి. మేం ఇంజినీరింగ్ చదువుకున్నాం.. లేబర్‌ డిపార్ట్‌మెంట్‌కు పోతమా..? అనే లేని అపోహ వాళ్ల మనసులోకి వచ్చింది. స్కిల్‌ యూనివర్సిటీకి దీన్ని అనుసంధానం చేసి పాలిటెక్నిక్‌ విద్యతోపాటు కొన్ని స్కిల్స్‌ నేర్పిస్తే వాళ్లకు వెంటనే ఉద్యోగాలొస్తయని ఆలోచన ప్రభుత్వం చేసి.. కానీ విద్యార్థులంతా కూడా మేం లేబర్‌ డిపార్ట్‌మెంట్‌లోకి వెళ్లం. రేపు పాలిటెక్నిక్‌ అయిపోతే ఇంజినీరింగ్‌ పోవాల్సినోళ్లం.. వైట్‌ కాలర్ జాబ్ చేయాల్సినవాళ్లమే తప్ప మేం కిందికి పోమనే ఆలోచనలో ఉన్నరు.. వాళ్లు కూడా కరెక్టే.. కాబట్టి నేను ప్రభుత్వాన్నికోరుతున్నానన్నారు.

పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యను పరిష్కరించేందుకు ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ వీటన్నింటిని కూడా అధ్యయనం చేస్తున్నది.. నేను ఆ కమిటీకి సూచించేది ఒకటే. పాలిటెక్నిక్ విద్యార్థులను టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌లోనే కొనసాగించాలి. పాలిటెక్నిక్ పూర్తయిన తర్వాత ఇంజనీరింగ్ వెళ్లడానికి లేటరర్‌ ఎంట్రీని కూడా ఉంచండి. వాళ్లను దేశవ్యాప్తంగా పాలిటెక్నిక్స్ ఎలా ఉన్నాయో అవన్నీ ఏఐసీటీఈ కింద ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా అదే పద్దతి కొనసాగితే బాగుంటుంది. ఆ విద్యార్థులు ఒక రకమైన అపోహలో, భయాందోళనలో ఉన్నారు. వాళ్ల అపోహలను నివృత్తి చేయాల్సిన అవసరముందన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana