Dailyhunt
kiranabbavaram: దర్శకుడిగా యంగ్ హీరో ఫస్ట్ మూవీ అప్‌డేట్!

kiranabbavaram: దర్శకుడిగా యంగ్ హీరో ఫస్ట్ మూవీ అప్‌డేట్!

NTV Telugu 3 weeks ago

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్ ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉంది. రీసెంట్‌గా 'KA' సినిమాతో దీపావళి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న కిరణ్, తన మార్కెట్ వాల్యూను ఒక్కసారిగా పెంచేసుకున్నారు.

ఏకంగా రూ. 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఆఫర్లు వస్తున్నా, కిరణ్ మాత్రం తనలోని దర్శకుడిని నిద్రలేపాలని నిర్ణయించుకున్నారు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'రియాలిటీ' (Reality) చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించబోతుండటం ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్.

Aslo Read : VeeraBhadrudu : సూర్య 'కరుప్పు' తెలుగు టైటిల్ ఫిక్స్!

కిరణ్ అబ్బవరం కేవలం నటుడే కాదు, సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్నో షార్ట్ ఫిలిమ్స్‌కు కథలు రాసి, డైరెక్ట్ చేసిన అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే ఇప్పుడు 'రియాలిటీ' సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రం మే 2026 లో షూటింగ్ ప్రారంభించుకుని, మళ్ళీ సెంటిమెంట్‌గా దీపావళి కానుకగా నవంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. కిరణ్ అబ్బవరం ఈ ఏడాది కేవలం దర్శకుడిగానే కాకుండా, నిర్మాతగా కూడా బిజీగా ఉన్నారు. ఆయన సొంత బ్యానర్‌లో రూపొందిన 'తిమ్మరాజుపల్లె టీవీ' ఏప్రిల్ 17న విడుదలకు సిద్ధంగా ఉంది. దీనితో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఒక వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా, ఇప్పుడు దర్శకుడిగా కిరణ్ అబ్బవరం చేస్తున్న ఈ ట్రిపుల్ అటాక్ టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేసేలా కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu