Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..

Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..

NTV Telugu 1 week ago

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. 24 ఏళ్ల గర్భిణి అయిన భార్య నిఖత్ నిషాను, 25 ఏళ్ల భర్త షాదాబ్ చంపేశాడు. చంపిన తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారడు.

గోరఖ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరి మృతదేహాలు కూడా తాళం వేసిన గదిలో లభ్యమయ్యాయి. మొదట్లో ఇద్దరు కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నారని భావించినప్పటికీ, పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు తెలిశాయి. భార్యకు విషమిచ్చి, ఆపై గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. ఆ తర్వాత షాదాబ్ ఉరివేసుకుని మరణించారు.

Maharashtra: పొదుపు మంత్రం.. బైక్‌పై విధాన్ భవన్‌కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్

భార్య జీవనశైలి, దుస్తులు వేసుకోవడం, భర్త నిరుద్యగిగా ఉండటం వీరిద్దరి మధ్య గొడవలకు కారణమైంది. నిఖత్ షాదబ్ అత్త కూతురు. ఇద్దరికి చిన్నప్పుడే వివాహం నిశ్చయమైంది. ఇటీవల 5 నెలల క్రితం ఇద్దరికి వివాహం జరిగింది. నిఖత్ ముంబైలో తన కుటుంబంతో నివసిస్తుండగా, షాదాబ్ గోరఖ్‌పూర్ సమీపంలోని ఒక గ్రామంలో నివసించేవాడు. వివాహం తర్వాత నిఖత్ ముంబైని విడిచిపెట్టి షాదాబ్ గ్రామానికి వచ్చింది.

నిఖత్ ముంబైలో పుట్టిపెరగడం వల్ల అక్కడి దుస్తులు వేసుకోవడం వంటివి చేసిది. ఇక షాదాబ్ పూర్తిగా మత సంప్రదాయాలను పాటించేవాడు. నిఖత్ ఇంట్లో ప్యాంట్, టీషర్టులు వేసుకోవడం షాదాబ్‌కు నచ్చేది కాదు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఇక షాదాబ్ తండ్రి దుబాయ్‌లో పని చేస్తు్న్నాడు. షాదాబ్ మాత్రం ఇంట్లో నిరుద్యోగిగా ఉండేవాడు. నిఖత్ తరుచుగా షాదాబ్‌ను ఏదైనా పని చేయాలని కోరేది. ఈ పరిణామాల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు తెలిసింది. మృతుల ఇద్దరి మొబైల్ ఫోన్‌లలో మెసేజ్‌లు చూసిన తర్వాత వీరిద్దరి మధ్య గొడవలు తీవ్ర స్థాయిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu