Dailyhunt
చిరంజీవి రాముడిగా కనిపించడానికి సిద్ధమవుతున్నాడా..?

చిరంజీవి రాముడిగా కనిపించడానికి సిద్ధమవుతున్నాడా..?

Oktelugu.com 1 week ago

Chiranjeevi Lord Ram role: మెగాస్టార్ చిరంజీవి ఇంతకుముందు చేసిన సినిమాలన్నింటితో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి భారీ ఇమేజ్ ను కట్టబెట్టాయి.

గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న చిరంజీవి తన ఎంటైర్ కెరీర్ లో మాత్రం రాముడి పాత్రనైతే పోషించలేదు. ఆయన ఎన్నో పాత్రలకు ప్రాణం పోసినప్పటికి రాముడి పాత్రలో కనిపిస్తే చూడాలని తన అభిమానులైతే కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ఆయన రాముడి క్యారెక్టర్ లో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోపెట్టినప్పటికి రాముడి పాత్రలో ఎందుకు నటించలేదు. ఇప్పుడు చేస్తే ఆయన ఎలాంటి వైవిధ్యాన్ని చూపిస్తాడనేది కూడా తెలియాల్సి ఉంది.

అయితే ఫుల్ లెంత్ పౌరాణిక పాత్రల్లో నడుస్తున్నాడా? లేదంటే ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ లో మాత్రమే అలా కనిపించి వెళ్ళిపోబోతున్నాడా? అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులపాటు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది. ఇంతకీ ఆయన ఎవరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు అనేది తెలియదు కానీ దిల్ రాజు బ్యానర్ లో రాబోతుందనే విషయమైతే చాలా క్లారిటీ గా తెలుస్తోంది.

రణబీర్ కపూర్ 'రామాయణ్' టీజర్ రివ్యూ : విజువల్ వండర్ కి సరికొత్త నిర్వచనం..

ఈ దర్శకుడు ఎవరు ఇందులో హీరో ఎవరు అసలు చిరంజీవి రాముడిగా ఎందుకు కనిపించాల్సి వస్తుందనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇప్పటివరకు చిరంజీవి చేసిన అన్ని సినిమాల్లో అతనికి మంచి గుర్తింపు వచ్చే సన్నివేశాల్లో నటించి ప్రేక్షకులందరికీ శభాష్ అనిపించుకున్నాడు.

కానీ ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో మాత్రం ఆయన పాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది…చూడాలి మరి చిరంజీవి తన కెరియర్ లో ఒక్కసారైనా రాముడి పాత్ర చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడైనా వర్కౌట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com