Dailyhunt
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కు ముహూర్తం ఫిక్స్

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కు ముహూర్తం ఫిక్స్

Oktelugu.com 3 weeks ago

Google Data Center Visakhapatnam Inauguration: ఏపీలో( Andhra Pradesh) మరో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఇది. దాదాపు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో దీనిని నెలకొల్పనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. భూముల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ తరుణంలో ఈ నెల 28న ఇందుకు సంబంధించిన శంకుస్థాపన జరగనుంది. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ హాజరుకానున్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం జరిగితే అనుబంధంగా చాలా రకాల పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది.

అంతటి ఈడెన్ గార్డెన్స్ ను క్షణంలోనే కప్పేశారు.. గ్రౌండ్ మెన్ కృషికి హాట్సాఫ్

* మూడు చోట్ల భూములు..
విశాఖలో గూగుల్ డేటా సెంటర్( Google data centre) నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మూడు చోట్ల 600కు పైగా ఎకరాల భూమిని కేటాయించింది. మరో రెండేళ్లలో అంటే 2028 జూలై నాటికి ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్, అదానీ ఇన్ఫ్రా భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. ఏపీఐఐసీ తర్లువాడ లో 38 ఎకరాలను సేకరించింది. అందులో ఇటీవల 266.6 ఎకరాలను గూగుల్ కు కేటాయించింది. ఇలా కేటాయించిన భూముల్లో జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు. శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు. ఆయా భూములను చేరుకునేందుకు అవసరమైన రహదారి నిర్మాణాన్ని రెండు ప్యాకేజీల్లో చేపడుతున్నారు.
* తర్లువాడలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ కోసం అవసరమైన పర్యావరణ అనుమతికి ఇప్పటికే గూగుల్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. వైజాగ్ మెగా డేటా పార్క్ లిమిటెడ్ పేరుతో బిల్డింగ్ ప్లాన్ సమర్పించారు. మొత్తం 1.43 లక్షల చదరపు మీటర్లలో బిల్డప్ ఏరియాగా అందులో చూపించారు. ఇందులో పార్కింగ్ ప్లేస్ 33% కాగా.. గ్రీన్ బెల్ట్ కు 59.91 ఎకరాలు కేటాయించారు.
* మరోవైపు మొత్తం తర్లువాడలో 266 ఎకరాలు.. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 174 ఎకరాలు… అడవివరంలో 166 ఎకరాలు కేటాయించారు.
* విశాఖలో ఈ భారీ ప్రాజెక్టుతో దేశమే కాదు ప్రపంచం సాగరనగరం వైపు చూసే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com