Nagamani Malligari September 20, 2026prabhanews.com
ఆత్మీయ పలకరింపులు..
నాటి జ్ఞాపకాల నెమరువేత
నిజాంపేట, ఆంధ్రప్రభ : నిజాంపేట మండల కేంద్రంలో 1988-89 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం 37 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని నాటి పాఠశాల జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత మిత్రులంతా ఒకే చోట కలవడంతో ఆనందం వ్యక్తం చేశారు.
37 సంవత్సరాల తర్వాత పదో తరగతి బ్యాచ్‌కు చెందిన స్నేహితులందరం పూర్వ విద్యార్థుల సమ్మేళనం కోసం కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. త్వరలోనే అందరం ఒకే వేదికపై సమావేశమై పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.
తమ బ్యాచ్‌కు చెందిన ఇద్దరు మిత్రులు నిజాంపేట గ్రామ సర్పంచులుగా సేవలందించడంతో పాటు మరో మిత్రుడు ఎంపీటీసీగా ప్రజలకు సేవ చేయడం గర్వకారణమని తెలిపారు. అలాగే తమ బ్యాచ్‌కు చెందిన పలువురు స్నేహితులు వివిధ రంగాల్లో సేవలందిస్తూ, అనేక సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కొమ్మట సత్యనారాయణ, బజార్ తిరుమల గౌడ్, మావూరం రామచంద్రం, లక్ష్మణ్, రవీందర్‌రెడ్డి, యాదగిరి, గందే శ్రీనివాస్, అక్బర్, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, నర్సింలు, సత్యనారాయణ సెట్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
