49వ డివిజన్ లో పడకేసిన పారిశుధ్యం

49వ డివిజన్ లో పడకేసిన పారిశుధ్యం

ప్రభన్యూస్

ప్రభన్యూస్

16hr

Loading...

Nagamani Malligari April 7, 202649th Division

49వ డివిజన్ లో పడకేసిన పారిశుధ్యం

49వ డివిజన్ పలు చోట్ల పేరుకుపోయిన చెత్తాచెదారంకనబడని శానిటరీ ఇన్స్పెక్టర్ సచివాలయం శానిటరీ సెక్రటరీ

చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజక వర్గం 49వ డివిజన్ పరిధిలో పేరుకుపోయిన చెత్తాచెదరాన్ని ప్రతి రోజూ తొలగించటం లేదని స్థానికులు చెబుతున్నారు. 49 వ డివిజన్ పరిధిలోని అనేక చోట్ల చెత్తాచెదారం పేరుకుపోతుంది. 49 వ డివిజన్ పరిధిలోని వడియా దుర్గామ్మ ఆలయం మొదట విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద చెత్తాచెదారం పేరుకుపోయింది. దాంతో పశువులు వచ్చి వాటిని మరింత వీధి రోడ్డు మీద కు చెల్లాచెదురుగా చేస్తున్నాయి అని స్థానికులు అంటున్నారు. అలాగే జోడు బొమ్మలు వీధి మొదట కూడా చెత్తాచెదారం పేరుకుపోయింది అని స్థానికులు చెబుతున్నారు.

విజయవాడ నగరాన్ని పరిశుభ్రత స్వచ్చత విషయంలో ర్యాంక్ సాధించడానికి నగరపాలక సంస్థ విశేషంగా కృషి చేస్తుంది. ప్రతి నెలా మూడో శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం సైతం నిర్వహిస్తూ ప్రజల్లో, సిబ్బంది లోను పరిశుభ్రత పట్ల అనేక కార్యక్రమాలతో అవగాహన కల్పిస్తున్నారు. ఇళ్ళ నుండి వచ్చే చెత్త ను సైతం తడి చెత్త పొడి చెత్తగా విడగొట్టి ఇవ్వాలి అని విసృతంగా ప్రచారం జరుగుతోంది. కమిషనర్ ధ్యాన్ చంద్ క్షేత్రస్థాయిలో పర్యటన సందర్భంగా శానిటరీ సిబ్బంది కి వీధిల్లో చెత్తాచెదారాన్ని, కాలువల్లో సిల్ట్ ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశాలు జారీచేస్తున్న కొంతమంది సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు.

ప్రతి రోజు డివిజన్ లో సచివాలయంలో ఉండే శానిటరీ సెక్రటరీ పర్యటించి, ఎక్కడ చెత్తాచెదారం ఉంటే ఆ విషయాన్ని శానిటరీ ఇన్స్పెక్టర్ ద్వారా సిబ్బంది చేత తొలగించ వలసి ఉంది. 49వ డివిజన్ లో శానిటరీ సెక్రటరీ ని తాము ఎప్పుడూ చూడలేదు అని స్థానికులు అంటున్నారు. శానిటరీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 49వ డివిజన్ లో ప్రజలు ఇబ్బందులు పెడుతున్నారు. నగరపాలక సంస్థ అధికారులు స్పందించి వెంటనే పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News

Comments

2
Loading comments...