Srinivas April 7, 2026ethics and values in society, ethics in leadership, good and bad values, good vs bad behavior, indian epics moral lessons, moral story telugu, moral values article, personality development values, social values article
7thAprilchintana | మంచీ-చెడు నాలుగు రకాల ప్రవర్తనలు..
7thAprilchintana | వ్యక్తిత్వ అభ్యుదయానికి మంచి పనుల ప్రాముఖ్యతవిలువలు, నమ్మకాలు మరియు వ్యక్తి ప్రవర్తననైతికతతో నాయకత్వం మరియు సహజీవనంసంఘర్షణలో విలువలను కాపాడిన తల్లి సలహాఆదర్శ సమాజానికి మంచి వ్యక్తుల మార్గదర్శకం
7thAprilchintana | ప్రతి వ్యక్తి నిరంతరం తాను ఆనందంగా ఉండాలని, అభ్యుదయాన్ని సాధించాలని కోరుకుంటాడు. అప్పుడప్పుడు పొరపాట్లు దొర్లవచ్చు. అయినప్పటికీ నిరంతరం నేర్చుకోవడం, పొరపాట్లను సరిదిద్దుకోవడం ద్వారా తన వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించుకోవచ్చు. అనతికాలంలోనే అతనిలో పరివర్తన రావడం సాధ్యమే. నిరంతరం మంచి పనులను చేయడం ద్వారా సమాజం చేత గౌరవాన్ని పొందడం ప్రేరణగా మారి, అతనిలో వచ్చిన పరివర్తన శాశ్వతమవుతుంది. అలాగే మంచి వ్యక్తి ఎప్పుడైనా చెడు పనులు చేసినా వెంటనే తనను తాను సరిచేసుకుంటాడు.
తన గుర్తింపును నిరూపించుకోవడానికి, తన విలువలను సమాజంలో ప్రతిష్ఠించడానికి, తన నమ్మకాలే ఉదాత్తమని చూపించడానికి వ్యక్తి తన సామర్థ్యాన్ని వినియోగిస్తాడు. ఈ మూడు అంశాలు వ్యక్తి ప్రవర్తనను నేరుగా ప్రభావితం చేస్తాయి. తమ నమ్మకాలతో ఇతరులను ప్రభావితం చేయడానికి అవసరమైతే యుద్ధాలు కూడా చేస్తారు, ప్రాణత్యాగాలకూ వెనుకాడరు. వ్యక్తి ప్రవర్తన తనకు, సమాజానికి శ్రేయస్సును కలిగించేదిగా ఉండటం వ్యక్తి విలువలుగా పరిగణించవచ్చు. కనీసం అది ఇతరులకు హాని కలిగించకూడదు.
భావోద్వేగాలను నియంత్రించుకున్న వ్యక్తి తీసుకునే నిర్ణయాలు, చర్యలు అతని విలువలకు అద్దం పడతాయి. నైతికత విలువలకు తోడైతే వ్యక్తి ఆదర్శప్రాయుడిగా, ఉత్తమ నాయకుడిగా గుర్తింపు పొందుతాడు. ఇతరులతో ప్రవర్తించే విధానం విలువలు, నైతికతతో కూడి ఉంటే పరస్పరం ఆనందం లభిస్తుంది. వ్యక్తి ప్రకృతితో సహజీవనం చేయగలిగితే అభ్యుదయం సాధ్యమవుతుంది.
ఒక సంస్థలో ఉన్నతాధికారి ఒక వ్యక్తి ప్రయోజనాలకు అనుగుణంగా పని చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు లభిస్తుంది. ఆ పని చేయడం వల్ల సంస్థకు పెద్దగా నష్టం ఉండదు. కానీ అది నియమాలకు విరుద్ధం. ఈ పరిస్థితిలో అతనిలో సంఘర్షణ మొదలైంది. తల్లిని సలహా అడిగాడు. "బిడ్డా! నీవు చెప్పే విషయాలపై నాకంతగా అవగాహన లేదు. కానీ ప్రతిరోజూ రాత్రి నీవు గాఢంగా నిద్రపోతావు. ఉదయం నిన్ను నిద్రలేపడం నాకు అగ్నిపరీక్ష అవుతుంది. ఆ ప్రశాంత నిద్ర పోయే పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటాను" అని తల్లి చెప్పింది. ఈ సమాధానం వ్యక్తి విలువలు, నైతికతకు పెద్దపీట వేయడాన్ని సూచిస్తుంది.
మంచి-చెడు కలగలిపిన సమాజంలో వ్యక్తుల ప్రవర్తనలు వైవిధ్యభరితంగా ఉంటాయి. వాటిని నాలుగు విధాలుగా చూడవచ్చు - చెడు వ్యక్తి చెడు పనులు చేయడం, చెడు వ్యక్తి మంచి పనులు చేయడం, మంచి వ్యక్తి చెడు పనులు చేయడం, మంచి వ్యక్తి మంచి పనులు చేయడం. చెడు పనులు చేసే వ్యక్తిలో అంతర్గతంగా మార్పు వచ్చినప్పుడు సరైన పనులు ఎలా చేయాలో నేర్చుకుంటాడు. సమాజం అతనిని అనుమానించవచ్చు, వింతగా చూడవచ్చు. అయినా అతను తన మార్పును నిరూపించుకోవాలి.
చెడు వ్యక్తి చెడు పనులు చేయడం: ఇలాంటి వ్యక్తుల్లో నైపుణ్యాలు తక్కువగా ఉంటాయి. మానసిక పరిణతి లోపిస్తుంది. సమర్థత, నిబద్ధత, నిలకడలు లేక స్వార్థపరులుగా మారి విలువలకు ప్రాధాన్యత ఇవ్వరు. రామాయణంలో రావణుడు సీతను అపహరించడం వల్ల లంకానగరం నాశనమైంది. అలాగే దుర్యోధనుని ఈర్ష్యాసూయల వల్ల కౌరవ సామ్రాజ్యం కూలిపోయి మహా మారణహోమం జరిగింది.
చెడు వ్యక్తి మంచి పనులు చేయడం: సమాజంలో పటిష్టమైన చట్టాలు, ఉత్తమ సంస్కృతి ఉన్నా వ్యక్తి స్వార్థపరుడైతేక్రమశిక్షణ పాటించడు. సరైన వైఖరికి దూరమవుతాడు. రామాయణంలో అయోధ్యలో ఉత్తమ సంస్కృతి ఉన్నప్పటికీ, కైకేయి మంథర చెప్పుడు మాటలు విని రాముడిని అడవులకు పంపించింది. అలాగే మారీచుడు సీతాపహరణ తగదని బోధించాడు.
మంచి వ్యక్తి చెడు పనులు చేయడం:విలువలకు కట్టుబడిన వ్యక్తి అయినప్పటికీ చుట్టూ ఉన్న సమాజం ప్రలోభాలకు గురి చేస్తుంది. ఇలాంటి వారు వాతావరణాన్ని మార్చుకుంటేవిజయాన్ని సాధిస్తారు. రాముడు చెప్పుడు మాటలు విని సీతను అరణ్యాలకు పంపడం, మహాభారతంలో విలువలు ఉన్న కర్ణుడు దుర్యోధనుని స్నేహానికి కట్టుబడిఆధర్మాన్ని సమర్థించడం దీనికి ఉదాహరణలు.
మంచి వ్యక్తి మంచి పనులు చేయడం: ఇది ఆదర్శ సమాజానికిమార్గం చూపుతుంది. హనుమంతుడు జాంబవంతుని ప్రేరణతో సముద్రాన్ని లంఘించి సీతను కనుగొని రావణునికి ధర్మాన్ని బోధించాడు. అర్జునుని నిరాశను తొలగించికర్తవ్యానికి సిద్ధం చేసిన కృష్ణుడు కూడా దీనికి ఉదాహరణ. అలాగే తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన శకుంతల, ద్రౌపది వంటి వారు ధర్మబద్ధతకు ప్రతీకలు. చెడు వ్యక్తి చెడు పనులు చేసే విధానాన్ని నిరసించాలి. అలాగే మంచి పనులను ప్రోత్సహించడం ద్వారా సమాజాన్ని సత్పథంలో నడిపించాలి.
- పాలకుర్తి రామమూర్తి

