Bala Raju October 5, 2026Aadarsha Kutumbam, breaking news, latest telugu news, telugu latest news, telugu news, Venkatesh
సస్పెన్స్‌లో అభిమానులు!
Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ కుటుంబ కథా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీపై మళ్లీ అనిశ్చితి నెలకొనడం ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే ఒకసారి వాయిదా.. మరోసారి రీషెడ్యూల్..?
ఈ చిత్రాన్ని ముందుగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే సాంకేతిక కారణాలతో ఆ తేదీని అక్టోబర్ 9కి మార్చారు. ఆ సమయంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మీడియా వేదికగా మాట్లాడుతూ, చెప్పిన తేదీకే ఖచ్చితంగా థియేటర్లలోకి వస్తామని స్పష్టం చేశారు. కానీ రిలీజ్ సమయం దగ్గరపడుతున్న తరుణంలో, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికాకపోవడం వల్ల సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
అక్టోబర్ 30కి మారే అవకాశం..?
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని అక్టోబర్ వారంలో, అంటే అక్టోబర్ 30న విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. చివరి నిమిషంలో వాయిదా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో వెంకీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత నాగవంశీ ఈ వివాదంపై స్పందించి, విడుదల తేదీపై త్వరితగతిన స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
