ఆంధ్రుల రాజధాని అమరావతి.. పిచ్చోళ్ల రాజధాని మావిగన్

ఆంధ్రుల రాజధాని అమరావతి.. పిచ్చోళ్ల రాజధాని మావిగన్

ప్రభన్యూస్

ప్రభన్యూస్

17hr

Loading...

Nagamani Malligari April 7, 2026machilipatnam

ఆంధ్రుల రాజధాని అమరావతి.. పిచ్చోళ్ల రాజధాని మావిగన్

అమరావతికి జై.. మావిగన్‌కు నైరాష్ట్రం అభివృద్ధి చెందడం జగన్ కు ఇష్టం లేదు

అందుకే మావిగన్ అంటూ అమరావతిపై కుట్రలుఅభివృద్ధిని అడ్డుకునే వారిని ప్రజలే నిలదీయాలిమైలవరం ఎమ్మెల్యే వసంత ఘాటు వ్యాఖ్యలు

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఆంధ్రుల రాజధాని అమరావతి అయితే, పిచ్చివాళ్ల రాజధాని మావిగన్ అని మైలవరం శాసన సభ్యుడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు. కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ప్రజా దర్బార్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి మన హక్కు అని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎప్పటినుంచో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి చెందుతుందన్నారు. మన రాష్ట్రం, మన ప్రాంతం అభివృద్ధి చెందడం జగన్ కు ఇష్టం లేదని విమర్శించారు.

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్న వారిని ప్రజలే నిలదీయాలని పిలుపునిచ్చారు. అమరావతిపై జగన్ కుట్రలు సాగవన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి పై కుట్రలు చేసినందుకు 151లో 5 పీకి 11 ఉంచారని, ఇదే కొనసాగితే ఎటు పీకినా ఒకటే మిగులుతుందని ఎద్దేవా చేశారు. మావిగన్ అంటూ జగన్ జిల్లాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.

జగన్ చెప్పిన రెండు ప్రాంతాలు అమరావతిలో విలీనం అయ్యాయన్నారు. మచిలీపట్నంలో పూర్తి అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. అమరావతికి జై.. మావిగన్ కు నై అన్నారు. నాడు అమరావతికి అనుకూలమని చెప్పిన స్థానిక నాయకుడు ఇప్పుడు మౌనంగా ఉన్నారని విమర్శించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News

Comments

12
Loading comments...