Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఆంజనేయస్వామి ఆలయానికి శుభఘటం

Sowjanya Anneboina August 30, 2026prabhanews.com

టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వెలంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆంజనేయస్వామి ఆలయానికి శుభఘటం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఆలయ నిర్మాణ పనుల్లో భాగంగా దర్వాజా ఎత్తే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కూర వెంకటరాజిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దర్వాజా ఎత్తే కార్యక్రమంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆంజనేయస్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకున్నారు. నూతన ఆలయ నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని, అనంతరం స్వామివారి ప్రతిష్ఠా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News