Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

అబకస్‌తో గణితంపై ఆసక్తి పెంపు

Nagamani Malligari September 2, 2026prabhanews.com

విద్యార్థుల్లో వేగం, ఖచ్చితత్వం పెంచేందుకు సాధన ఉపయోగకరం

దండెపల్లి, ఆంధ్రప్రభ : దండెపల్లి మండలంలోని ద్వారక ఎంపీపీఎస్‌ పాఠశాలలో బుధవారం అబకస్‌ తరగతులను మండల విద్యాధికారి మంత్రి రాజు ప్రారంభించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు గణితంలో వేగం, ఖచ్చితత్వాన్ని పెంచేందుకు అబకస్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహించడం వల్ల విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుందని తెలిపారు. అబకస్‌ సాధనతో విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆలోచనా శక్తి అభివృద్ధి చెందుతాయని అన్నారు.

గణిత సమస్యలను వేగంగా, సులభంగా పరిష్కరించే సామర్థ్యం విద్యార్థుల్లో పెరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు అబకస్‌ సాధనను సద్వినియోగం చేసుకుని గణితంపై పట్టు సాధించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నీరటి సురేష్‌, సీఆర్‌పీ సురేందర్‌, ఉపాధ్యాయులు లావణ్య, సౌజన్య, శాంత, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News