Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి

Pavan Chandragiri July 31, 2026

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పలు పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ మున్సిపల్ కౌన్సిలర్లు శుక్రవారం జిల్లా కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు.

మోత్కూర్‌లో మహాత్మా జ్యోతిరావు ఫూలే చౌరస్తా నుంచి ముశిపట్ల మీదుగా దత్తప్పగూడెం వరకు బీటీ రోడ్డు, మోత్కూర్ నుంచి పనకబండ-రాగిబావి వరకు బీటీ రోడ్డు, అంబేద్కర్ చౌరస్తా నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయం వరకు ప్రధాన రహదారి ఇరువైపులా రోడ్డు, సైడ్ డ్రైన్ల నిర్మాణం, హైస్కూల్‌లో ఓపెన్ జిమ్, అన్నెపువాడ సాయినగర్‌లో మినీ ఫంక్షన్ హాల్, ఓపెన్ జిమ్, గాంధీనగర్‌లో ఓపెన్ జిమ్ తదితర అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కౌన్సిలర్లు కోరారు.

వినతిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సానుకూలంగా స్పందించి, ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా, కౌన్సిలర్లు కారుపోతుల వెంకన్న గౌడ్, బీసు శ్రీకాంత్ గౌడ్, మెంట రమణ నగేష్, మొగుళ్ల అనురాధ, గణగాని శైలజ, కుర్మిల్ల ప్రమీల, పన్నాల శ్రీవిద్య, కాంగ్రెస్ నాయకులు బొల్లేపల్లి శ్రవణ్, అలకుంట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News