Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

అడవుల్లో చెట్లను రంపంతో కోసివేత..

Nagamani Malligari September 1, 2026prabhanews.com

వ్వాల సెక్షనులోని బంగారుతాండ అడవుల్లో ఘటన..
విచారించిన రాష్ట్ర అటవీ విజిలెన్స్ బృందం..

నాలుగు టేకు చెట్లను రంపంతో కోసి,దుంగల తరలింపు..
రూ.ఒక లక్ష విలువ..
టేకు దుంగలను ఇతర ప్రాంతాలకు తరలించిన స్మగ్లర్లు
జన్నారం, ఆంధ్రప్రభ :
కవ్వాల అడవుల్లో కలప స్మగ్లర్లు రంపంతో టేకు చెట్లను కోసి,దుంగలుగా తయారు చేసి ఇతర ప్రాంతాలకు తరలించగా,విషయం తెలుసుకున్న రాష్ట్ర అటవీశాఖ విజిలెన్స్ బృందం మంగళవారం మధ్యాహ్నం ఆ ప్రాంతానికి వచ్చి విచారించారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని కవ్వాల టైగర్ రిజర్వ్, జన్నారం అటవీ డివిజనల్, ఇందనపల్లి రేంజు, కవ్వాల ఫారెస్ట్ సెక్షనులోని బంగారుతాండ ఫారెస్ట్ బీటు అడవుల్లో నాలుగు టేకు చెట్లను రంపముతో స్మగ్లర్లు కోశారు. ఆ తర్వాత రంపంతో దుంగలు తయారు చేసి స్మగ్లర్లు ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకున్నారు.

ఈ వ్యవహారాన్ని రాష్ట్ర అటవీ శాఖ విజిలెన్స్ ఉన్నతాధికారులకు ఓ అపరిచితుడు ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర అటవీశాఖ విజిలెన్స్ డీఎఫ్ఓ శివయ్య ఆదేశాల మేరకు హైదరాబాద్ నుంచి రాష్ట్ర అటవీ శాఖ విజిలెన్స్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మురళిమనోహర్ బృందం మంగళవారం అడవుల్లోకి వచ్చి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆ విజిలెన్స్ రేంజర్ సాయంత్రం ఫోన్లో మాట్లాడుతూ.. అడవుల్లోకి వెళ్లి విచారణ జరిపిమన్నారు. నాలుగు దృఢమైన టేకు చెట్లను రంపంతో కోసి,దుంగలుగా తయారుచేసి ఇతర ప్రాంతాలకు తరలించినట్లు గుర్తించామని ఆయన తెలిపారు. ఆ ఘటన విచారణ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆ టేకు కలప విలువ సుమారు రూ.ఒక లక్ష వరకు ఉంటుందని ఇందన పల్లి ఇన్చార్జి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బాబా ఖాదర్ వలీ సాయంత్రం తెలిపారు. ఈ ఘటనపై స్థానిక ఎఫ్డీఓ రామ్మోహన్ ను సంప్రదించగా, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News