Nagamani Malligari September 1, 2026prabhanews.com
మణిదీప్‌ను అభినందించిన మహా ఆది సేవా సంస్థ ప్రతినిధులు
బెల్లంపల్లిటౌన్, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి పట్టణంలోని ఇంక్లైన్ రాడ్ గంబాలబస్తీకి చెందిన దాసరి మణిదీప్ ఐఐటీలో సీటు సాధించారు.
పేద కుటుంబానికి చెందిన విద్యార్థి ప్రతిభను గుర్తించిన మహా ఆది సేవా సంస్థ ప్రతినిధులు మంగళవారం బెల్లంపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా మణిదీప్‌ను ప్రతినిధులు అభినందించారు. ఉన్నత విద్యను కొనసాగించేందుకు తమ వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. విద్యార్థి తన లక్ష్యాన్ని సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సేవా సంస్థ ప్రతినిధులు రాజగట్టయ్య, నాతరి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
