Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

అక్రమ అరెస్టును ఖండించిన జిల్లా కమిటీ

Bala Raju October 5, 2026breaking news, illegal arrest, latest telugu news, MCPI(U) leaders, telugu latest news, telugu news

ఖానాపూర్, అక్టోబర్ 5 (ఆంధ్రప్రభ): ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకులను అర్ధరాత్రి వేళ ఇళ్లలోకి చొరబడి అరెస్టు చేయడాన్ని ఎంసీపీఐ(యూ) జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది.

నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి అల్లెపు పీటర్, సహాయ కార్యదర్శి భూక్య సురేందర్‌లను సోమవారం అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో పోలీసులు అక్రమంగా అరెస్టు చేసినట్లు పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారు..

ఈ సందర్భంగా ఎంసీపీఐ(యూ) జిల్లా నాయకులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచుతూ సామాన్యులపై భారం మోపుతున్నారని, విద్య, వైద్య రంగాల్లో విచ్చలవిడిగా దోపిడీ సాగుతోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా, దాన్ని ప్రశ్నించే నాయకులపై అక్రమ కేసులు బానాయిస్తూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రజా సంఘాలు మద్దతుగా నిలవాలి..

రాజ్యాంగబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ చేపట్టిన ఈ అక్రమ అరెస్టులను ప్రజా సంఘాలు, మానవ హక్కుల వేదికలు, మేధావులు ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. తక్షణమే అరెస్టయిన నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) జిల్లా కమిటీ సభ్యులు స్వరూప, హైమద్ ఖాన్, గౌస్, జాఫర్, రాధా తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News