Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

అంతరించిపోతున్నజానపద కళలకు జీవం పోయాలి

Bala Raju October 24, 2026prabhanews.com

బిజ్వార్‌లో ఘనంగా 'భీమసేన విలాసం' యక్షగాన ప్రదర్శన

ఊట్కూర్‌, ఆంధ్రప్రభ: కంప్యూటర్‌ యుగంలో అంతరించిపోతున్న జానపద కళలను కాపాడి, భావితరాలకు అందించాలని బిజ్వార్‌ సర్పంచ్‌ కొల్లంపల్లి అంజయ్య, ఉపసర్పంచ్‌ గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

శుక్రవారం రాత్రి నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ మండలం బిజ్వార్‌లో 'భీమసేన విలాసం' నాటిక ప్రదర్శనను వారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన రైతులు, యువకులు రోజంతా పనులు చేసుకుని, రాత్రివేళల్లో రెండు నెలలపాటు సాధన చేసి ఈ ప్రదర్శనకు సిద్ధమవడం అభినందనీయమన్నారు. సుమారు రూ.80 వేల సొంత ఖర్చుతో మన సంస్కృతి, సంప్రదాయాలు, కళలను భావితరాలకు పరిచయం చేసేందుకు వారు చేస్తున్న కృషిని ప్రశంసించారు. భీమసేన విలాసం యక్షగానంలో 12 మంది కళాకారులు భారీ కిరీటాలు, రంగురంగుల దుస్తులు ధరించి పద్యాలు ఆలపిస్తూ, నృత్యాలతో మహాభారతంలోని భీముడి పరాక్రమాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా అజ్ఞాతవాసంలో భీముడు కీచకుడిని వధించే ఘట్టాన్ని కళాకారులు అద్భుతంగా ప్రదర్శించడంతో ప్రేక్షకులు ఆసక్తిగా తిలకించారు. ఈ ప్రదర్శనతో వర్షాలు కురిసి కరువు తొలగిపోతాయనే స్థానిక నమ్మకం ఉందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పంతులు పులిమామిడి చెన్నయ్య దాసు, కళాకారులు చింతలి ఎల్లప్ప, లొడ్డ సంజప్ప, కొల్లంపల్లి రామప్ప, తోక పరశురాం, గడ్డం లక్ష్మీకాంత్‌, జట్రం ఆంజనేయులు, దొబ్బలి తిరుమలేశ్‌, తోక ఆంజనేయులు, దొబ్బలి ఈశ్వరప్ప, డోలిమి కథలప్ప, దొబ్బలి కుర్మప్ప, దాసరి ఆంజనేయులు, హాస్యనటుడు ధన్వాడ వెంకట్రాములు, వాయిద్యకారులు హన్మంతు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News