Sowjanya Anneboina August 31, 2026prabhanews.com
ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి. భూషణ్
కడెం, ఆంధ్రప్రభ: అర్హులైన ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అందిస్తుందని ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి.
భూషణ్ అన్నారు. సోమవారం కడెం మండల తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ రేషన్ కార్డులు, స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ భూషణ్, ఆర్‌టీఏ సభ్యుడు తుమ్మల మల్లేష్, కడెం మండల తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్, నిర్మల్ డీసీసీ ప్రధాన కార్యదర్శి పి. సతీష్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, మండల ప్రధాన కార్యదర్శి ముడికే మల్లేష్ యాదవ్, రేషన్ షాప్ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు కే. రాజేశ్వర్ పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన డిజిటల్ రేషన్ కార్డులను అందజేశారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా చేరేందుకు డిజిటల్ రేషన్ కార్డులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వారు తెలిపారు. ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిజిటల్ విధానం ద్వారా రేషన్ కార్డుల వివరాలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కడెం డీటీఎం లచ్చిరాం, ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పి. సంపత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బబ్లు బ్రహ్మచారి, మండలంలోని పలు గ్రామాల రేషన్ షాప్ డీలర్లు, రేషన్ కార్డు వినియోగదారులు పాల్గొన్నారు.
