Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలి

Sowjanya Anneboina August 22, 2026prabhanews.com

చింతకాని, ఆంధ్రప్రభ: చింతకాని, ముదిగొండ, బోనకల్ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశం చింతకాని మండలం నాగులవంచలోని వీవీసీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.

సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ పీసీసీ కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ ప్రాథమిక ఓటరు జాబితాలో పేరు నమోదు కాని అర్హులైన ఓటర్లను గుర్తించి, వారి పేర్లు తుది ఓటరు జాబితాలో నమోదయ్యేలా బూత్ లెవల్ ఏజెంట్లు ప్రత్యేక కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో నివసిస్తున్న ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించే దిశగా పార్టీ శ్రేణులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు.

ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై బూత్ లెవల్ ఏజెంట్లకు అవగాహన కల్పిస్తూ అర్హులైన కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, చిరునామా మార్పులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతకాని, ముదిగొండ, బోనకల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కన్నెబోయిన గోపి యాదవ్, గుడిపూడి బుచ్చయ్య, కర్నాటి రామకోటేశ్వరరావు, మత్కేపల్లి ఏఎంసీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, మల్లెల అజయ్, తిరుపతి, యాదయ్య, ఆలస్యం బసవయ్య, మూడు మండలాలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News