Sowjanya Anneboina August 30, 2026prabhanews.com
జోడువాగులపై నూతన వంతెన నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని డిమాండ్
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల-చెన్నూర్ జాతీయ రహదారిలోని జోడువాగులపై నూతన వంతెన నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న అటవీ శాఖ సమస్యలను పరిష్కరించి, నిర్మాణానికి అనుమతులు కల్పించాలని కోరుతూ చెన్నూర్ కాంగ్రెస్ నాయకులు ఆదివారం జోడువాగు వద్ద ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే జోడువాగుల వంతెన ప్రస్తుతం ఇరుకుగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నూతన వంతెన నిర్మాణానికి అవసరమైన అటవీ శాఖ అనుమతులను త్వరగా మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.
