Sowjanya Anneboina September 1, 2026prabhanews.com
విద్యార్థుల అభ్యాస సామర్థ్యాల పరిశీలన.. ఉపాధ్యాయులకు సూచనలు
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: జి ల్లా విద్యా విభాగం ఆర్మూర్ డివిజన్ రెండో బృందం మంగళవారం బాచన్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యా ప్రమాణాలను పరిశీలించింది.
ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను పరీక్షించి, వారి విద్యా ప్రగతిని సమీక్షించారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించేందుకు ఉపాధ్యాయులు పాటించాల్సిన బోధనా పద్ధతులు, విషయ బోధనలో తీసుకోవాల్సిన మెలకువలపై తనిఖీ బృందం సభ్యులు పలు సూచనలు చేశారు.
పాఠశాల పర్యవేక్షణ అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించి విద్యార్థుల అభ్యాస ఫలితాలు, బోధనా విధానాలపై చర్చించారు. అనంతరం హిందీ భాషా ఆటల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. బాచన్‌పల్లి పాఠశాలను పునరుజ్జీవింపజేసి ఆదర్శంగా నడిపిస్తున్న ప్రధానోపాధ్యాయుడు బాల గంగాధర్‌ను జిల్లా తనిఖీ బృందం నోడల్ అధికారి వెంకటయ్య తో పాటు బృంద సభ్యులు ఆత్మీయంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తనిఖీ బృందం నోడల్ అధికారి వెంకటయ్య, సభ్యులు కోకిల నాగరాజు, విశ్వనాథ్, గంగా మోహన్, రమేష్, రాచర్ల గంగాధర్, పీడీ గంగాధర్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
