Babu Bahadur September 1, 2026Bayyaram Lake, Bayyaram Peddacheruvu, farmers, irrigation water
Bayyaram-Peddacheruvu-Overflows : బయ్యారం గలగల Andhra Prabha Top News
- అలుగుపై మత్తడి జలజల
- పెద్ద చెరువు పరువళ్లు
(బయ్యారం, ఆంధ్ర ప్రభ)
జిల్లాలో ప్రధాన సాగు నీటివన రైన బయ్యారం పెద్ద చెరువు మంగళవారం తెల్లవారు జాము నుండి మత్తడి దూకుతుంది. ఎల్ నినో ప్రభావం తో గతంలోన్ ఎన్నడూ లేనివిధంగా సెప్టెంబర్ నెలలో చెరువు పూర్తి సామర్థ్యాన్ని చేరుకుంది. నీటి మట్టం 16.2 అడుగులకు చేరింది. గత సంవత్సరం జులై 23 న అలుగు పారగా 2024 లో జులై 12 వతరీకుననే మత్తడి దూకింది. ఈ సంవత్సరం ఆలస్యం కావడంతో రైతులు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
ఈపాటికే రైతులు వరి సాగు చేపట్టారు.ఈ మారు వర్షాలు ఆలస్యయం కావడంతో రైతులు ఎక్కువగా వెదజల్లే పద్ధతిని అవలంబించారు. కొద్ది మంది రైతులు నాట్లుకూడా వేశారు. అయితే ప్రస్తుతం ఆ పంటలన్నీ నీరు లేక వాడి పోతున్నాయి. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.వేలాది రూపాయలు పెట్టు బడి పెట్టి వున్నారు.నీరు వదలక పోతే పరిస్తితి ఏమిటి అని రైతుల కనీళ్లు పెట్టు కుంటున్నారు.గత రెండు రోజులుగా రైతులు నీటిని వదులుతారా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. నీరు వదిలినప్పటికి పంటలు చేతికి వస్తాయా లేదా అనేది మరి కొందరు రైతులను వేధిస్తున్న ప్రశ్న.నీటి విడుదల పై రైతుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నీరు వదలాలి అంటే,కొందరు రెండవ పంటకు వదలాలని కోరుతున్నారు. ప్రస్తుతం బయ్యారం పెద్ద చెరువు కింద రైతుల పరిస్థితి సందిగ్ధంగా మారగా ,అధికారులకు సైతం ఇబ్బందికరంగానే వుంది. మరి అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో నని రైతులు ఎదురు చూస్తున్నారు.
