Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

భూముల రీ-సర్వేను మరింత వేగవంతంగా పూర్తి చేయాలి

Nagamani Malligari September 2, 2026prabhanews.com

రో 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలి..
హనుమకొండ జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హనుమకొండ, ఆంధ్రప్రభ : భూ సమస్యల పరిష్కారానికి చేపట్టిన భూముల రీ-సర్వేను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ సర్వేయర్లను ఆదేశించారు. బుధవారం ఐనవోలు మండలం పంథిని గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే పురోగతిని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

గ్రామ పరిధిలో మొత్తం 3,541 ఎకరాల భూమి ఉండగా.. ఇప్పటివరకు 2,144 ఎకరాల భూమికి రీ-సర్వే పూర్తయినట్లు సర్వేయర్లు కలెక్టర్‌కు వివరించారు. పట్టాదారు పాస్‌పుస్తకాల్లో నమోదైన భూమి విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో రైతులు అనుభవిస్తున్న భూమి విస్తీర్ణానికి ఏమైనా తేడాలు ఉన్నాయా అని కలెక్టర్‌ రైతులను అడిగి తెలుసుకున్నారు.

భూముల రీ-సర్వే జరుగుతున్న పంట పొలాల వద్ద ఉన్న రైతులు రాజిరెడ్డి, రామరాజు, సంపత్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, మాధవి, సరోజన, నిర్మల తదితరులతో కలెక్టర్‌ మాట్లాడారు. రీ-సర్వే జరుగుతున్న తీరును, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. భూముల రీ-సర్వే చేపట్టడం సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం మంచి కార్యక్రమాన్ని చేపట్టిందని రైతులు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గ్రామంలో చేపట్టిన భూముల రీ-సర్వేను మరో 15 రోజుల్లో పూర్తి చేయాలని సర్వేయర్లను ఆదేశించారు. రైతుల భూముల రీ-సర్వే వివరాలను భూఖండ పటంలో నమోదు చేసే ప్రక్రియను కూడా వెంటనే పూర్తి చేయాలని సూచించారు.

రీ-సర్వేతో భూముల హద్దులు, విస్తీర్ణం, పట్టాదారుల వివరాల్లో స్పష్టత వస్తుందని కలెక్టర్‌ తెలిపారు. భూ రికార్డులు సక్రమంగా అందుబాటులోకి రావడంతో భవిష్యత్తులో రైతులకు భూ సంబంధిత సమస్యలు తగ్గుతాయని పేర్కొన్నారు.

సర్వేయర్లు రోవర్‌ పరికరాలతో భూముల రీ-సర్వే చేస్తున్న తీరును కలెక్టర్‌ పరిశీలించారు. గ్రామంలో రీ-సర్వే క్షేత్రస్థాయి పురోగతి బాగుండటంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ శ్రీరాం భూపాల్‌, హనుమకొండ ఆర్డీవో వెంకటేష్‌, జిల్లా భూముల కొలతల శాఖ సహాయ సంచాలకుడు నూర్‌సింగ్‌, తహసీల్దార్‌ విక్రమ్‌కుమార్‌, సర్వేయర్‌ సూరజ్‌, ఇతర అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News