Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

భూపాలపల్లి ఏరియాలో ఉత్సాహంగా కబడ్డీ పోటీలు

Sowjanya Anneboina September 1, 2026prabhanews.com

ఉద్యోగుల ఆరోగ్యం, మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ: సింగరేణి భూపాలపల్లి ఏరియాలో 2026-27 సంవత్సరానికి సంబంధించి వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాఖాపరమైన క్రీడా పోటీల్లో భాగంగా మంగళవారం కబడ్డీ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.

డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

తొలుత అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, ఉత్సాహానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. మహిళా ఉద్యోగులు కూడా క్రీడల్లో చురుగ్గా పాల్గొని తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణతో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. క్రీడలతో ఉద్యోగుల్లో ఐక్యత, స్నేహభావం, జట్టు స్ఫూర్తి పెంపొందుతాయని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News