Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

బీఆర్ఎస్ పాలనలో బీసీల సంక్షేమానికి కృషి..

Sowjanya Anneboina October 3, 2026prabhanews.com

  • బీసీలను విస్మరిస్తోన్న కాంగ్రెస్‌
  • ఎమ్మెల్సీ ఎల్‌.రమణ

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : బీసీల సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిందని ఎమ్మెల్సీ ఎల్‌.రమణ అన్నారు.

పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ బీసీ సెల్‌ సమావేశం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఆర్‌ఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎల్‌.రమణతో పాటు పల్లె రవికుమార్‌గౌడ్‌, బాలరాజ్‌ యాదవ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. కేసీఆర్‌ హయాంలో గొల్ల, యాదవ, ముదిరాజ్‌, కాపు తదితర బీసీ వర్గాలతో పాటు అన్ని కులాల అభ్యున్నతికి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

బీసీలకు రాజకీయంగా, సామాజికంగా అవకాశాలు కల్పించామన్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. బీసీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

బీసీల సమస్యల పరిష్కారం కోసం పార్టీ తరఫున పోరాడతామని, హక్కుల సాధనకు బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ గ్రంథాలయ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, మాజీ మార్కెట్‌ చైర్మన్‌, సింగిల్‌విండో చైర్మన్లు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్‌, పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్‌, కొయ్యడ సతీష్‌, బీసీ సెల్‌ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News