Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

బీజేపీ అధ్యక్షుడివి చిల్లర రాజకీయాలు..

Sowjanya Anneboina September 1, 2026prabhanews.com

ల్గొండ, ఆంధ్రప్రభ : బీజేపీ అధ్యక్షుడివి చిల్లర రాజకీయాలని, విలువలు మరిచిపోయి సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ విమర్శించారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అయితే బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

బీజేపీలో విలువలు కలిగిన నాయకులు ఎంతో మంది ఉన్నారని, ఇలాంటి నాయకుల వ్యవహారశైలి ఆ పార్టీకి ఎలాంటి ప్రయోజనం చేకూర్చదని అన్నారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంటికి వచ్చి దాడి చేస్తే తాము ఊరుకుంటామా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని, రాజకీయ లబ్ధి కోసం సంస్కారహీనంగా, విలువలు మరిచి వ్యవహరిస్తున్నారని శంకర్ నాయక్ ఆరోపించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News