Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

బీజేపీ సీనియర్ నాయకుడు షేక్ లతీఫ్ మృతికి సంతాపం

Rama Rao August 30, 2026Telangana

డిగూడెం, ఆంధ్రప్రభ: మండలానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు షేక్ లతీఫ్ మృతి చెందడంతో పార్టీ నాయకులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు ఓర్సు వేళంగి రాజు, నడిగూడెం మండల అధ్యక్షుడు బండారు వీరబాబు యాదవ్ మాట్లాడుతూ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన షేక్ లతీఫ్ మృతి పార్టీకి, వ్యక్తిగతంగా తమకు తీరని లోటని పేర్కొన్నారు. షేక్ లతీఫ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు. కార్యక్రమంలో నడిగూడెం మండలం మాజీ అధ్యక్షుడు దున్న సతీష్, చిలుకూరు మండల అధ్యక్షుడు మహేష్, మండల ప్రధాన కార్యదర్శులు రౌతు కళ్యాణ్, కేశగాని పాపయ్య, మండల ఉపాధ్యక్షులు ముప్పా నరసింహారావు, బీరవెల్లి గోపాల్‌రెడ్డి, మామిడి రామకృష్ణ, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు రౌత్ వర్మ, మండల కార్యదర్శి రవి, రాముడు, యువ నాయకుడు మామిడి గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News